News October 4, 2024
మీరు ఇలా జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవ్వాలి?: సుప్రీంకోర్టు

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యాన్ని SC ఆక్షేపించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యుడి ఎన్నికకు అదేశాలు సహా ప్రిసైడింగ్ అధికారిని నియమించడాన్ని తప్పుబట్టింది. ‘కమిటీ మీటింగ్‌కి మేయర్ అధ్యక్షత వహించాలి. మీకు అధికారం ఎక్కడిది? 487 కిందనా?. అది కార్యనిర్వాహక శక్తి. మీరు ఇలా జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవ్వాలి?’ అని ప్రశ్నించింది.
Similar News
News March 4, 2025
మనుస్మృతి, బాబర్‌నామా విషయంలో వెనక్కి తగ్గిన ఢిల్లీ వర్సిటీ

తమ చరిత్ర పుస్తకాల్లో బాబర్‌నామా, మనుస్మృతి చేర్చాలన్న ప్రతిపాదనను ఢిల్లీ వర్సిటీ ఉపసంహరించుకుంది. ఫ్యాకల్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. వీటిని చరిత్ర పుస్తకాల్లో చేర్చే ప్రతిపాదనను గత నెల 19న వర్సిటీలోని జాయింట్ కమిటీ ఆఫ్ కోర్సెస్ ఆమోదించింది. అయితే వీటి కారణంగా వివాదాలు పెరగొచ్చన్న ఆందోళనలతో వర్సిటీ తాజాగా వెనక్కితగ్గింది.
News March 4, 2025
MLC కౌంటింగ్: ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 1,492 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి అంజిరెడ్డికి 14,690 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 13,198, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 10,746 ఓట్లు సాధించారు.
News March 4, 2025
ప్రియుడితో హీరోయిన్ తమన్నా బ్రేకప్?

లవ్ బర్డ్స్ తమన్నా, విజయ్ వర్మ తమ డేటింగ్‌కు బ్రేకప్ చెప్పినట్లు ‘పింక్ విల్లా’ కథనం ప్రచురించింది. కొన్ని వారాల క్రితమే విడిపోయిన వీరిద్దరూ స్నేహితులుగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపింది. 2023లో లస్ట్ స్టోరీస్-2 సందర్భంగా తమన్నా, విజయ్ మధ్య రిలేషన్‌షిప్ బయటి ప్రపంచానికి తెలిసింది. త్వరలో పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతున్న వేళ బ్రేకప్ వార్తలు రావడం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.