News October 4, 2024
దేశంలో మళ్లీ ఎగ్జిట్ పోల్స్ సందడి

2024 సార్వత్రిక ఎన్నికల తరువాత మరోసారి దేశంలో ఎగ్జిట్ పోల్స్ సందడి నెలకొంది. జమ్మూకశ్మీర్, హరియాణ ఎన్నికలకు సంబంధించి శనివారం సాయంత్రం 6 గంటల తరువాత పలు సంస్థలు తమ అంచనాలను వెల్లడించనున్నాయి. ఇప్పటికే JK ఎన్నికలు ముగిశాయి. శనివారం హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ సమయం ముగిసిన తరువాత ఫలితాల అంచనాలు వెలువడనున్నాయి.
Similar News
News March 4, 2025
మూడోసారి బెయిల్ పొందిన రెజ్లర్ సుశీల్ కుమార్

మర్డర్ కేసులో మాజీ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50,000 బాండు, 2 ష్యూరిటీలు ఇచ్చాక ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 2021, మేలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌ఖడ్ హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడు. దీంతో పాటు అల్లర్లు, అక్రమంగా గుమికూడటం వంటి అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. 2023, మార్చిలో తండ్రి అంత్యక్రియలు, జులై 23న మోకాలి ఆపరేషన్ కోసం ఆయన వారం పాటు బెయిల్ పొందడం గమనార్హం.
News March 4, 2025
ఔరంగజేబ్ సమాధి తొలగించండి: నవనీత్ కౌర్

మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అబూ అజ్మీపై బీజేపీ నేత నవనీత్ కౌర్ ధ్వజమెత్తారు. శివాజీ మహారాజ్ రాష్ట్రంలో ఔరంగజేబ్‌ను పొగటటం ఏంటని ప్రశ్నించారు. ఔరంగజేబ్ సమాధిని రాష్ట్రం నుంచి తొలగించాలని ప్రభుత్వాన్నికోరారు. ఆయనను ఇష్టపడే వారింట్లో ఏర్పాటు చేసుకోమన్నారు. అతని దాష్ఠీకాలు తెలియాలంటే ఛావా సినిమా చూడాలని సూచించారు. మెుగల్ రాజు మందిరాలు నిర్మించాడని, ఆయన పరిపాలన బాగుండేదని అబూ అజ్మీ అన్నారు.
News March 4, 2025
MLC ఎన్నికల కోడ్ ఎత్తివేత

AP: ఉమ్మడి గుంటూరు- కృష్ణా, ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ప్రకటన జారీ చేశారు. దీంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ఆంక్షలను ఎత్తివేయనున్నారు. గత నెల 3నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.