News October 4, 2024

భారీ ఎన్‌కౌంటర్.. 30 మంది మావోలు మృతి

image

మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 30 మంది మరణించారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.

Similar News

News March 11, 2026

భామిని: ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటుపై ఫీజుబులిటి టీం పరిశీలన

image

హైయిర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు, బామినిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుపై ఫీజుబులిటీ టీం బుధవారం పరిశీలన చేసింది. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, అంశాలను రెవెన్యూ శాఖతో చర్చించారు. ఫీజుబు‌లిటీ టీంలో పాలకొండ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా.ఎం. శ్యాంబాబు, సీతంపేట డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా. వి ప్రభాకర్ రావు, పాలకొండ డిగ్రీ కాలేజీ ఫిజిక్స్ లెక్చరర్ శ్రీనివాసరావు ఉన్నారు.

News March 11, 2026

స్టాక్ మార్కెట్లు క్రాష్

image

యుద్ధం ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఫ్లాట్‌గా స్టార్ట్ అయిన సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,342 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు కోల్పోయాయి. సన్ ఫార్మా, ఎన్టీపీసీ మినహా అన్ని కంపెనీల షేర్లు ఘోర నష్టాలు చవిచూశాయి. FII అమ్మకాలు, ప్రాఫిట్ బుకింగ్, ఇరాన్‌పై దాడులు కొనసాగుతుండడం మార్కెట్లపై ప్రభావం చూపించింది.

News March 11, 2026

యూజర్లకు షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్?

image

మొబైల్ డేటాపై ట్యాక్స్ విధించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధ్యయనం చేయాలని టెలికం విభాగాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇది ఆదాయం పెంచడంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు దోహదం చేస్తుందని ఆలోచిస్తుందట. ఒక GB డేటాపై ₹1 ట్యాక్స్ వేసినా ఏటా ₹22,900 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.