News October 4, 2024
HYDలో T20 మ్యాచ్.. భారీ బందోబస్తు

ఈ నెల 12న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్ VS బంగ్లాదేశ్ మధ్య T20-2024 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను రాచకొండ CP సుధీర్ బాబు పరిశీలించారు. అనంతరం DCPలు, ACPలు, HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్‌తో సమావేశం నిర్వహించారు. క్రికెట్ అభిమానులకు అసౌకర్యం కలగవద్దని, T20 మ్యాచ్ నిర్వహణకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు CP సుధీర్ బాబు వెల్లడించారు.
Similar News
News March 19, 2026
FLASH: త్వరలో ఉప్పల్ రింగ్ రోడ్డు బంద్!

ఉప్పల్ రింగ్ రోడ్డు త్వరలో బంద్ కానుంది. రామంతపూర్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ హైవే వైపు వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపు పనుల్లో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డు సెంటర్లో పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ అధికారుల బృందం పూర్తిగా స్టడీ చేసింది. త్వరలోనే రింగ్ రోడ్డు బంద్ చేసి, ట్రాఫిక్ మళ్లింపులు చేసి, కారిడార్ నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు.
News March 19, 2026
HYD: పిల్లి లేదని అమ్మాయి సూసైడ్

పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మీర్‌పేట్ PSపరిధిలో చోటుచేసుకుంది. బడంగ్‌పేట్‌లోని వెంకటాద్రి నివాస్‌కు హిమబిందు (20) తాను ఎంతో ఇష్టంగా పెంచుకొన్న పెంపుడు పిల్లి మృత్యువాత పడింది. ఇది తట్టుకోలేక పురుగు మందు తాగి హిమబిందు ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
News March 19, 2026
Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.


