News October 4, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలోని పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు అనంతపురంలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Similar News

News March 11, 2026

జాగ్రత్త.. లేపేస్తాం: ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకుంటే ఇరాన్‌ను మరింత బలంగా దెబ్బతీస్తామని ట్రంప్ హెచ్చరించగా.. దీనిపై ఇరాన్ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ ఘాటుగా స్పందించారు. ‘మీకంటే గొప్పవారే ఇరాన్‌ను ఏమీ చేయలేకపోయారు. జాగ్రత్త.. లేదంటే మీరే లేకుండాపోతారు’ అని ట్రంప్‌ను హెచ్చరించారు.

News March 11, 2026

కొడుకును వారసుడిగా తిరస్కరించిన ఖమేనీ?

image

తన కుమారుడు మొజ్తబా వారసుడు కావడం దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఇష్టం లేదట. ఈ మేరకు వీలునామాలో స్పష్టంగా పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ రాసుకొచ్చింది. అయినా IRGC బలవంతంగా మొజ్తబా పేరును ప్రతిపాదించి కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకునేలా చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ పాలనను వ్యతిరేకించిన అలీ ఖమేనీ నిర్ణయానికి భిన్నంగా సైన్యం ముందుకు వెళ్లడం ఇప్పుడు ఇరాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

News March 11, 2026

60 ఏళ్లలో 100 రెట్లు పెరిగిన సిలిండర్ ధర!

image

దేశంలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలు 60 ఏళ్లలో భారీగా పెరిగాయి. 1960లో కేవలం ₹7 నుంచి ₹10 మధ్య ఉన్న ధర 2026 నాటికి ఢిల్లీలో ₹913కు చేరుకుంది. 1990లో ₹120, 2010లో ₹400గా ఉన్న ధర నేడు సామాన్యుడిపై పెను భారంగా మారింది. అంతర్జాతీయ ఇంధన ధరల మార్పులు, మారుతున్న సబ్సిడీ విధానాలు & ద్రవ్యోల్బణం కారణంగానే ఈ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన ఆరు దశాబ్దాలలో సిలిండర్ ధర దాదాపు వంద రెట్లు పెరగడం గమనార్హం.