News October 5, 2024

ఆదిలాబాద్: వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

నిరక్షరాస్యులైన వయోజనులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం కార్యక్రమాన్ని రూపొందించిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం సమావేశంలో కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 15 ఏళ్లుపై బడిన నిరక్షరాస్యులను గుర్తించి ఐదు దశల్లో వారికి శిక్షణా నిచ్చి అక్షరాస్యులుగా తీర్చదిద్దాలన్నారు.

Similar News

News March 11, 2025

గుడిహత్నూర్‌లో శిశువు మృతదేహం కలకలం

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో దారుణం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలం గురజ గ్రామ శివారులోని వాగులో మంగళవారం ఉదయం మగ శిశువు మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేయడంతో ఇచ్చోడ సీఐ భీమేశ్, గుడిహత్నూర్ ఎస్ఐ మహేందర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.

News March 11, 2025

ADB: రూ.75.31లక్షల కరెంట్ బిల్లు పెండింగ్

image

జిల్లాలోని 447 పాఠశాలల్లో మొత్తం రూ.75.31 లక్షల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు అధికారులు పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. అవి పాత కరెంటు బిల్లులు కావడంతో చెల్లించలేదని, నిధులు మంజూరైనప్పటి నుంచి రెగ్యులర్ బిల్లు చెల్లిస్తున్నామని పలువురు HMలు వివరించారు. కాగా నెల రోజుల్లో బకాయిలు పూర్తి చేయకపోతే కరెంటు సరఫరా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు.

News March 11, 2025

ADB: కనిపించకుండా పోయి.. శవమై తేలాడు

image

మావలలో ఓ వ్యక్తి <<15710393>>మృతదేహం<<>> లభ్యమైన విషయం తెలిసిందే. అయితే మావల ఎస్ఐ గౌతమ్ వివరాల మేరకు.. మావలకు చెందిన షేక్ పర్వేజ్ (22) పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం సమయంలో ఇంటి నుంచి బయలుదేరి.. రాత్రయినా తిరిగి వెళ్లలేదు. సోమవారం ఉదయం మావల ఎర్రకుంట చెరువులో శవమై కనిపించాడు. కాగా తల్లి ఫిర్యాదు మేరకు సూసైడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

error: Content is protected !!