News October 5, 2024

ABHIMANYU: అసాధారణంగా ఆడుతున్నా అవకాశమేదీ?

image

దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరాఖండ్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. కానీ టీమ్ ఇండియా ఎంట్రీ మాత్రం ఆయనకు అందని ద్రాక్షగా మారిందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇరానీ ట్రోఫీలోనూ 191 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడారు. 166 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలతో 7,506 పరుగులు చేశారు. 29 ఏళ్ల అభిమన్యును బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సెలక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News October 5, 2024

పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు!

image

AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై తమిళనాడులోని మదురైలో వంచినాథన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో తెలిపింది. తమ డిప్యూటీ CM ఉదయనిధిపై, మైనారిటీలపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించినట్లు పేర్కొంది. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించింది. ఉదయనిధి వ్యాఖ్యల్ని పవన్ ఖండించడాన్ని అడ్వకేట్ తప్పుబట్టారని తెలిపింది.

News October 5, 2024

‘OG’ ఇండస్ట్రీ హిట్ అవుతుంది: తమన్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమా అప్‌డేట్స్ గురించి తనను అందరూ అడుగుతున్నారని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. డైరెక్టర్ సుజిత్ అద్భుతంగా మూవీని రూపొందిస్తున్నారని, కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని తెలిపారు. త్వరలోనే మూవీ టీమ్ నుంచి అప్‌డేట్స్ వస్తాయన్నారు. అలాగే ‘గేమ్ ఛేంజర్’ నుంచి నెక్స్ట్ విడుదలయ్యే మెలోడీ పాట కూడా అద్భుతంగా వచ్చిందని చెప్పారు.

News October 5, 2024

SC వర్గీకరణ రివ్యూ పిటిషన్లు కొట్టివేత

image

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అవకాశం కల్పిస్తూ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన 32 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో ఎలాంటి దోషాలు కనిపించడం లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు నిబంధనలు-2013లోని 47 రూల్ 1 కింద వీటిని సమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గత నెల 24నే ఈ ఉత్తర్వులు వెలువడగా తాజాగా బహిర్గతమయ్యాయి.