News October 5, 2024
నెల్లూరు: టీడీపీలో చేరిన కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గం 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆయనతో పాటు మిత్రబృందానికి టీడీపీ కండువాలు కప్పి ఆత్మీయ ఆహ్వానం పలికారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారి కోసం పనిచేయాలని శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Similar News
News March 11, 2025
నెల్లూరు: సరైన బిల్లులు లేని 4 కేజీల బంగారం స్వాధీనం

వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద జిల్లా విజిలెన్స్ ఎస్పీ రాజేంద్రకుమార్ ఆదేశాల మేరకు సీఐ కే.నరసింహారావు, DCTO కే. విష్ణు రావు తమ సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. సరైన బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న రూ.3 కోట్ల 37 లక్షల విలువైన 4 కేజీల 189 గ్రాములు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం, కారును జీఎస్టీ అధికారులకు అప్పగించారు.
News March 11, 2025
నెల్లూరు: కలెక్టరేట్‌లో ఉచితంగా భోజనాలు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో కలెక్టరేట్‌లో జరిగే PGRSకు ప్రజలు ప్రతి సోమవారం వస్తూ ఉంటారు. భోజన సమయం అయ్యేసరికి చేతిలో ఉండీ, లేక చాలామంది పస్తులు ఉంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కలెక్టర్ ఆనంద్ అర్జీదారులకు ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. సమస్యలతో వచ్చే ప్రతి ఒక్కరూ కడుపునిండా భోజనం చేసేలా ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ఆనంద్‌ను ప్రజలు అభినందిస్తున్నారు.
News March 11, 2025
నెల్లూరు: నీటిపారుదల పైపుల ఏర్పాటుకు రూ.35 లక్షలు మంజూరు

జాతీయ పోషకాహార భద్రత పథకంలో భాగంగా చిరుధాన్యాలు, నీటిపారుదల కొరకు పైపుల ఏర్పాటుకు రూ.35 లక్షల నిధులు మంజూరైనట్లు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లాలో 70 వేల హెక్టార్లలో రైతుకు ఐదు ఎకరాల చొప్పున రూ.15 వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని రైతులు ఆయా మండలాల్లో వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు.