News October 5, 2024

పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు!

image

AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై తమిళనాడులోని మదురైలో వంచినాథన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో తెలిపింది. తమ డిప్యూటీ CM ఉదయనిధిపై, మైనారిటీలపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించినట్లు పేర్కొంది. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించింది. ఉదయనిధి వ్యాఖ్యల్ని పవన్ ఖండించడాన్ని అడ్వకేట్ తప్పుబట్టారని తెలిపింది.

Similar News

News February 7, 2026

పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,890 పెరిగి రూ.1,56,600కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,650 ఎగసి రూ.1,43,550 పలుకుతోంది.

News February 7, 2026

ఆదిత్య హృదయంలో ఏం ఉంటుంది? ఎందుకు చదవాలి?

image

రామాయణంలో అగస్త్య మహర్షి రాముడికి ఉపదేశించిన స్తోత్రం ఆదిత్య హృదయం. దీన్ని ఆదివారం నాడు చదవడం ఫలప్రదం. ఇందులో 30 శ్లోకాలుంటాయి. మొదటి 14 శ్లోకాలు సూర్యుని ప్రశస్తిని, 15-21 ప్రార్థనను, 22-27 శుభ ఫలితాలను వివరిస్తాయి. ఈ స్తోత్ర పఠనంతో శత్రువులపై విజయం, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం, దారిద్ర్య విముక్తి లభిస్తాయి. మనశ్శాంతితో పాటు కోరిన కోరికలు నెరవేర్చే శక్తివంతమైన కవచంలా ఇది భక్తులను రక్షిస్తుంది.

News February 7, 2026

పేరెంటింగ్ పద్ధతి మారాలి

image

ప్రపంచం వేగంగా మారుతోంది. దానికి తగ్గట్లే పేరెంటింగ్ కూడా మారాలంటున్నారు సైకాలజిస్టులు. పిల్లల ప్రవర్తన మనకు కొత్తగా ఉండొచ్చు కానీ అది తప్పు కాదు. పాత తరానికి కొత్త తరానికి మధ్య ఉన్న గ్యాప్ అది. దాన్ని భర్తీ చేయడానికి, పిల్లలతో కనెక్ట్ కావడానికి పేరెంట్స్ ప్రయత్నించాలని చెబుతున్నారు. వారి ఫ్రీక్వెన్సీకి తగ్గట్లు ట్యూన్ అవ్వడానికి పేరెంట్స్ ప్రయత్నిస్తేనే వారిని అర్థం చేసుకోవడం వీలవుతుందంటున్నారు.