News October 5, 2024

యాదాద్రి: భార్యను హత్య చేసిన భర్త

image

మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేసిన ఘటన అడ్డగూడూరు మండలం డి.రేపాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోనుగ స్వరూప, కృష్ణారెడ్డి దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన కృష్ణారెడ్డి తాగి వచ్చి భార్య స్వరూపతో గొడవపడి హత్య చేశాడు. సాధారణ మరణంగా చిత్రీకరించబోయి దొరికిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 5, 2026

దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

image

జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి ఈనెల 7న కలెక్టరేట్‌లో ‘ప్రత్యేక ప్రజావాణి’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బాధితులు నేరుగా వచ్చి తమ విన్నపాలను అందజేయవచ్చని, అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.

News March 5, 2026

నల్గొండ: ఈ ఆలయానిది 200 ఏళ్ల చరిత్ర

image

చండూరు మండలం తుమ్మలపల్లిలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. కోనేరు వద్ద వెలిసిన లింగాన్ని చూసి రామ్‌సింగ్, పీత సింగ్ సోదరులు ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. 1895లో రాపోలు సాదుపుల్లయ్య ఇక్కడ శివరాత్రి కళ్యాణ వేడుకలు ప్రారంభించగా, నిజాం ప్రభుత్వం ఆలయానికి 28 ఎకరాల భూమిని మంజూరు చేసింది. ఏ కాలంలోనూ ఎండిపోని ‘పుట్టుగుండం’ ఇక్కడి ప్రత్యేకత.

News March 5, 2026

నల్గొండ: మళ్లీ 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ

image

NLG జిల్లాలోని 5,38,650 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని ఏప్రిల్‌లోనే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, రాబోయే CMR సేకరణకు స్థలం కేటాయించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 23,700 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 1,051 రేషన్ షాపులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.