News October 5, 2024

NZB: చిన్నారిపై దాడి చేసిన కుక్క

image

నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్క శుక్రవారం దాడి చేసింది. కిరాణా షాపులో బిస్కెట్ కొనుగోలు చేసి వెళ్తున్న చిన్నారిని గాయపరిచింది. చిన్నారి చెంప, పెదవిపై గాయాలయ్యాయి. చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News January 16, 2026

నిజామాబాద్‌లో కొండెక్కిన చికెన్ ధరలు

image

నిజామాబాద్‌లో చికెన్ ధరలు కొండక్కాయి. కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 320 ఉండగా, స్కిన్ చికెన్ 300గా ఉంది. లైవ్ చికెన్ లైవ్ చికెన్ రూ.260 గా ఉంది. చేపలు రవాటాలు కిలో రూ.200 ఉండగా, మొట్ట చేపలు రూ.700 కిలోకు విక్రయిస్తున్నారు. అయితే సంక్రాంతి కనుమ పండుగ కావడంతో అధిక మొత్తంలో మాంసం తినడం ఆచారంగా వస్తోంది. మాంసం కొనేందుకు సైతం అధిక ఆసక్తి కనబడుతున్నారు.

News January 16, 2026

UPDATE: పతంగుల షాపు యజమానికి 14 రోజుల రిమాండ్

image

నిజామాబాద్ టూటౌన్ పరిధిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న సుల్తాన్ కైట్ షాపుపై ఈనెల 1న పోలీసులు దాడి చేసి చేసిన సంగతి తెలిసిందే. అయితే పరారీలో ఉన్న షాపు యజమాని ఫహీమ్ అన్సారీని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించారని టూ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు.

News January 16, 2026

నిజామాబాద్: ఆపరేషన్ సింధూర్, పుష్ప పతంగుల జోరు

image

నిజామాబాద్ లో సంక్రాంతి సందర్భంగా ఆపరేషన్ సింధూర్, పుష్ప పతంగులు సందడి చేశాయి. ప్రత్యేకంగా ఈ కైట్లు ఎగురవేసేందుకు పిల్లలు యువత ఆసక్తి చూపించారు. ఎటు చూసినా ఆపరేషన్ సిందూర్ కైట్‌లే కనిపించాయి. మోదీ భద్రత దళాలతో ఉన్న ఫోటో కైట్ పై ఆకట్టుకుంటుంది. ఆపరేషన్ సిందూర్, పుష్ప రెండు ఎంత సక్సెస్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇపుడు సంక్రాంతి కైట్‌లలో కూడా పాపులర్ అయ్యాయి.