News October 5, 2024

ఖైదీల అసహజ మరణాలకు రూ.5 లక్షల పరిహారం

image

AP: జైళ్లలో ఖైదీలు మరణిస్తే ఇచ్చే పరిహారంపై రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఘర్షణ, జైలు సిబ్బంది వేధింపులతో ఖైదీ మరణిస్తే కుటుంబీకులకు రూ.5 లక్షలు అందిస్తారు. జైలు అధికారులు, వైద్యుల నిర్లక్ష్యంతో ఖైదీ చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా రూ.3.5 లక్షలు చెల్లిస్తారు. సహజ మరణం, అనారోగ్యం, తప్పించుకుని పారిపోయి చనిపోతే ఈ పరిహారం వర్తించదు. జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిబంధనలు రూపొందించారు.

Similar News

News October 5, 2024

TTDలో రివర్స్ టెండరింగ్ రద్దు

image

AP: TTDలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ EO శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. దీంతో పాత పద్ధతిలోనే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అన్ని రకాల పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను NDA ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ తదితర సంస్థలు అమలుచేస్తున్న ఈ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.

News October 5, 2024

కంపెనీల వెబ్‌సైట్లకూ బ్లూటిక్.. త్వరలో గూగుల్ కొత్త ఫీచర్

image

ఫేక్ వెబ్‌సైట్లను సులభంగా గుర్తించడం, అందులోని సమాచారం ఆధారంగా యూజర్లు మోసపోకుండా ఉండేందుకు గూగుల్ చర్యలు తీసుకుంటోంది. సోషల్ మీడియా అకౌంట్ల మాదిరిగానే కంపెనీల వెబ్‌సైట్లకు వెరిఫైడ్ బ్లూటిక్ ఇచ్చే ఫీచర్‌పై పనిచేస్తోంది. మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ వెబ్‌సైట్ లింక్‌లకు బ్లూటిక్ ఇచ్చి పరీక్షించింది. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

News October 5, 2024

రికార్డు సృష్టించిన హర్మన్ ప్రీత్

image

మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక ఎడిషన్లకు కెప్టెన్సీ చేసిన భారత కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు నెలకొల్పారు. ఆమె ఇప్పటివరకు 4 ఎడిషన్లలో (2018, 2020, 2023, 2024) టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆమె తర్వాత మిథాలీ రాజ్(2012, 2014, 2016), జులన్ గోస్వామి (2009, 2010) ఉన్నారు.