News October 5, 2024

APIIC ఛైర్మన్‌గా మంతెన రామరాజు బాధ్యతలు

image

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (APIIC) ఛైర్మన్‌గా మంతెన రామరాజు శనివారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని రామరాజు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన్ను వారు అభినందించారు.

Similar News

News March 18, 2026

ప.గో: కుమారుడితో కలిసి టెన్త్ పరీక్షలు రాస్తున్న తల్లి

image

పాలకొల్లుకు చెందిన ముత్యాల అశ్విని (33) తన కుమారుడు విజయ్‌తో కలిసి పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. 2001లో ఆరో తరగతితోనే చదువు ఆపేసి చిన్న వయసులో వివాహం చేసుకున్న ఆమె.. ఇన్నాళ్లకు కుమారుల చొరవతో మళ్లీ పుస్తకం పట్టారు. చదువు విలువ తెలుసుకొని ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్న ఈ తల్లి పట్టుదలను స్థానికులు అభినందిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలనే వారి ఆశయం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.

News March 18, 2026

నరసాపురం వాసికి రాష్ట్ర స్థాయి అవార్డు

image

నరసాపురం రుస్తుంబాదకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు కొప్పినీడి విజయ మోహన్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. మంగళవారం ఈ ప్రకటన వెలువడగా, ఆయన ప్రస్తుతం పాలకొల్లు మండలం గవరపేట సచివాలయంలో విలేజ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా సేవలు అందిస్తూనే, చిత్రకళలో విజయాలు సాధిస్తున్న ఆయనను తోటి ఉద్యోగులు, స్థానికులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

News March 18, 2026

రెవెన్యూ క్లినిక్‌లతో భూసమస్యల పరిష్కారం: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యలపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ లు ఉత్తమ ఫలితాలు నిస్తున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ..29 డిసెంబర్, 2025న రెవెన్యూ క్లినిక్‌లు ప్రారంభం నాటి నుంచి మార్చి 16, 2026 వరకు 10 విడతలుగా రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం 461 దరఖాస్తులు అందగా 148 పరిష్కరించామన్నారు.