News October 5, 2024

శ్రీకాకుళంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!

image

శ్రీకాకుళంలో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.69గా ఉంది. నిన్నటితో(110.68)తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. మరోవైపు, లీటర్ డీజిల్ ధర రూ.97.48గా ఉంది. ఇది కూడా నిన్నటి (98.39) ధర కంటే తగ్గింది. ఈనెల తొలి ఐదురోజుల్లో డీజిల్‌కు ఇదే అత్యల్ప ధర.

Similar News

News March 6, 2026

శ్రీకాకుళంలో ఆ అద్భుత ఘట్టానికి వేళాయే

image

శ్రీకాకుళం ప్రత్యక్షదైవం ఆరోగ్యప్రదాత అరసవల్లి ఆదిత్యుని మూలవిరాటుపై తొలి సూర్యకిరణాలు స్పృశించే అద్భుత ఘట్టం ఈ నెల 9, 10 తేదీల్లో ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శంకర శర్మ, ఆలయ ఈవో K.N.V.D.V ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా ఆలయ గర్భాలయంలో కొలువైన ఆదిత్యుని పాదాలపై నేరుగా తొలి సూర్యకిరణాలు తాకనున్నాయి.

News March 5, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

☞ఎచ్చెర్ల: వర్సిటీలో యూత్ పార్లమెంట్ కార్యక్రమం
☞శ్రీకాకుళం: మహిళ భద్రతకు ప్రాధాన్యత
☞ఈనెల 9,10 తేదీల్లో ఆదిత్యుని కిరణ స్పర్శ
☞నరసన్నపేట: శవ గదికెళ్లాలంటే పరీక్షే
☞శ్రీకాకుళంలో మర్డర్..నిందితుడి అరెస్ట్
☞అచ్చెన్న మంత్రి పదవికి రాజీనామా చేయాలి: పేరాడ తిలక్
☞SKLM: మార్చి 8న అస్మిత అథ్లెటిక్స్ పోటీలు
☞కరగాం: గుండెపోటుతో యువ ఇంజినీర్ మృతి

News March 5, 2026

వే2 న్యూస్ కథనానికి స్పందన..తీరిన దివ్యాంగుడి పెన్షన్ టెన్షన్

image

పొందూరు(M) బొట్లపేట వాసి నవీన్ 100% దివ్యాంగుడు. గతంలో వచ్చిన పింఛన్ నిలిచిపోయింది. అచేతనంగా కదలలేని స్థితిలోనున్న నవీన్‌ను భుజంపై మోసుకొని తల్లిదండ్రులు అధికారులు, కార్యాలయాల చుట్టు తిరిగినా సమస్య తీరలేదు. దీనిపై Way2Newsలో OCT22, 2025న ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’ అనే శీర్షికతో కథనం వచ్చింది. అనంతరం వచ్చిన వార్తలకు MLA కూన స్పందించి ఉన్నతాధికారులకు నివేదికివ్వగా పింఛన్ మంజారైంది.