News October 5, 2024

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నందికొట్కూరు విద్యార్థిని ఎంపిక

image

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నందికొట్కూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని హబ్షిబా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ షేక్షావలి, ఫిజికల్ డైరెక్టర్ రియాజుద్దీన్ శుక్రవారం తెలిపారు. కర్నూలు స్టేడియంలో సెప్టెంబర్ 26న జరిగిన అండర్-19 స్కూల్ గేమ్స్ ఉమ్మడి కర్నూలు జిల్లా కబడ్డీ పోటీలలో హబ్షిబా ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు.

Similar News

News March 4, 2026

కర్నూలు: ఎండల ఎఫెక్ట్.. వడదెబ్బతో సర్పంచ్ భర్త మృతి

image

ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం కర్నూలులో 39 డిగ్రీలు, నంద్యాలలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. కాగా, నంద్యాల(D) జూపాడు బంగ్లా(M) తాటిపాడు సర్పంచ్ వంగల లక్ష్మీదేవి భర్త కృష్ణారెడ్డి(62) వడదెబ్బతో మృతిచెందారు.

News March 4, 2026

కర్నూలు జిల్లా కోర్టులో భద్రత సమీక్ష

image

కర్నూలు జిల్లా కోర్టు ప్రాంగణంలో జడ్జి రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీ బాబు ప్రసాద్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, గస్తీ విధులు, ఖైదీల రక్షణను సమీక్షించారు. కోర్టు పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. భద్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.

News March 3, 2026

మంత్రి టీజీ భరత్ ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చర్చకు సిద్ధమా?

image

ఈ రెండేళ్లలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఎన్ని పరిశ్రమలు తీసుకోచ్చారు? యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చర్చకు సిద్ధమా అని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం కర్నూలులో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు రెడ్ బుక్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పరారవుతున్నారన్నారు. రాష్ట్రంలో పబ్‌లు తప్ప హబ్‌లు లేవన్నారు. కార్మిక రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.