News October 5, 2024
దసరా సెలవుల్లోనూ క్లాసులు.. విద్యార్థుల ఆవేదన

AP: ఈ నెల 2 నుంచే దసరా సెలవులు ప్రారంభమైనా కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు తరగతులు నిర్వహిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులకు హాజరుకావాలని విద్యార్థులకు స్పష్టం చేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా సెలవులతో సిలబస్ పూర్తికాలేదనే నెపంతో పిల్లలకు దసరా ఆనందాలను దూరం చేస్తున్నాయి. ఇలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.
Similar News
News July 5, 2025
ప్రసిద్ధ్ కృష్ణపై ట్రోల్స్

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఘోరంగా విఫలమైన భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై SMలో భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. షార్ట్ పిచ్ బంతులు వేసి జేమీ స్మిత్ సెంచరీకి కారణమయ్యాడని పలువురు విమర్శిస్తున్నారు. ‘ప్రసిద్ధ్ భారత్ వెర్షన్ హారిస్ రవూఫ్’ అని ఒకరు, ‘అతడిని వెంటనే ఇండియాకు పంపండి.. అవసరమైతే టికెట్ నేనే స్పాన్సర్ చేస్తా’ అని మరొకరు, ‘ప్రసిద్ధ్ ఇంగ్లండ్ తరఫున రన్ మెషిన్’ అని ఇంకొకరు కామెంట్లు పెడుతున్నారు.
News July 5, 2025
IIIT లిస్ట్.. ఒకే స్కూల్ నుంచి 26 మంది ఎంపిక

TG: నిన్న విడుదలైన బాసర IIIT <<16941421>>జాబితాలో<<>> నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్ ZPHS విద్యార్థులు సత్తాచాటారు. ఏకంగా ఈ స్కూలు నుంచి 26 మంది ఎంపికయ్యారు. వీరిలో 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. ఈ మండలం నుంచి 41 మంది స్టూడెంట్స్ సెలక్ట్ అవ్వడం గమనార్హం. ఎంపికైన విద్యార్థులకు స్కూల్ సిబ్బంది అభినందనలు తెలిపారు. కాగా తొలి విడతలో 1,690 మంది ఎంపికయ్యారు.
News July 5, 2025
మరో 30, 40 ఏళ్లు జీవించాలని ఉంది: దలైలామా

ప్రజలకు సేవ చేసేందుకు మరో 30, 40 ఏళ్లు జీవించాలని ఆశగా ఉందని టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా అన్నారు. బుద్ధుడి బోధనల వ్యాప్తికి కృషి చేస్తానని చెప్పారు. రేపు ఆయన 90వ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో అవలోకితేశ్వర ఆశీర్వాదాలు తీసుకున్నారు. కాగా తనకు 90 ఏళ్లు నిండటంతో 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని ఇటీవల ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.