News October 5, 2024

పేదలను ఎలా ఆదుకోవాలో సలహా ఇవ్వండి: CM

image

TG: మూసీ నిర్వాసితులను ఏ విధంగా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. పేదలకు అన్యాయం చేయబోమని, రివర్ బెడ్, బఫర్ జోన్‌లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తామని స్పష్టం చేశారు. మూసీ విషయంలో రెచ్చగొట్టే వారి మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. పేదల మంచి కోసమే తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. పేదలకు న్యాయం చేసేందుకు BRS, BJPలు సూచనలు చేయాలని కోరారు.

Similar News

News January 23, 2026

పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలంటే?

image

మగపిల్లలకు 3, 5, 7, 9, 11వ నెలలో లేదా 3వ ఏట, ఆడపిల్లలకు 4, 6, 8, 10, 12వ నెలలో లేదా సరి సంవత్సరాల్లో ఈ కార్యం చేయాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. సోమ, బుధ, గురు, శుక్రవారాలు పుట్టు వెంట్రుకలు తీయడానికి అత్యంత శ్రేష్ఠమైనవని చెబుతున్నారు. ఆది, మంగళ, శనివారాలను నివారించాలని శాస్త్రం చెబుతోంది. వీలైనంత వరకు ఉదయం పూట, ముఖ్యంగా ‘సింహ లగ్నం’ లేదా ఇతర శుభ లగ్నాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం మంచిది.

News January 23, 2026

శాతావాహన యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా

image

TG: కరీంనగర్‌లోని శాతావాహన యూనివర్సిటీలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 50 కంపెనీలు IT, ఫార్మా, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, FMCG, మేనేజ్‌మెంట్ విభాగంలో 5వేల పోస్టులను భర్తీ చేయనున్నాయి. బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ, ఫార్మా, నర్సింగ్ అర్హత గల అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

News January 23, 2026

స్టెప్-అప్ SIP: మీ పెట్టుబడికి బూస్టర్ డోస్!

image

మొక్క ఎదుగుతున్న కొద్దీ ఎక్కువ నీరు, ఎరువు ఎలా అవసరమో.. పెట్టుబడికీ అదనపు పోషణ కావాలి. ఆదాయం పెరిగే కొద్దీ SIP మొత్తాన్ని కొంత శాతం పెంచడమే ‘స్టెప్-అప్ SIP’. Ex రియా, ప్రియ ఇద్దరూ ₹5,000తో SIP మొదలుపెట్టారు. రియా ఏటా తన పెట్టుబడిని 10% పెంచుకుంటూ పోయారు. 10 ఏళ్ల తర్వాత 12% రిటర్న్స్‌తో ప్రియ వద్ద ₹11.6 లక్షలు ఉంటే.. రియా దగ్గర ఏకంగా ₹16.8 లక్షలు చేరాయి. చిన్న మార్పుతో ₹5 లక్షల లాభం.