News October 5, 2024

వాళ్లకు మాత్రమే రుణమాఫీ జరగలేదు: CM రేవంత్

image

TG: రూ.2లక్షలలోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ అన్నారు. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు, ఆ పై మొత్తాన్ని చెల్లిస్తే మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లు ఎక్కడానికి బదులుగా ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మితే ‘మన్నుపోసి అంబలి కాసిన’ పరిస్థితి వస్తుందని రేవంత్ అన్నారు.

Similar News

News October 5, 2024

నా వల్ల తలెత్తిన ఇబ్బందులు పరిష్కరిస్తా: కొలికపూడి

image

AP: తన వల్ల కొందరికి ఇబ్బందులు తలెత్తుతాయని ఊహించలేదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తన పని తీరు వల్ల క్యాడర్‌లో సమన్వయ లోపం ఏర్పడిందని, ఆ ఇబ్బందులను తానే సరిదిద్దుకుంటానని చెప్పారు. అమరావతిలో టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా, ఎంపీ కేశినేని, వర్ల రామయ్యతో ఆయన భేటీ అయ్యారు. కాగా రేపు పార్టీ పెద్దల ఆధ్వర్యంలో తిరువూరులో సమావేశం నిర్వహిస్తున్నారు.

News October 5, 2024

వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా సురేఖపై కామెంట్స్ ఎందుకు?: పొన్నం

image

TG: తన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నా సినీ ఇండస్ట్రీ వాళ్లు ఆమెపై కామెంట్స్ చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆమె ఆవేశంలో మాట్లాడారని చెప్పారు. తన తప్పును గ్రహించి, వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని తెలిపారు. అంతకంటే ముందు సురేఖపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌పైనా సినిమా వాళ్లు స్పందించి ఉంటే బాగుండేది అని పొన్నం అభిప్రాయపడ్డారు.

News October 5, 2024

దర్శకధీరుడితో ఎన్టీఆర్: పిక్ వైరల్

image

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిశారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవల విడుదలైన ‘దేవర’తో ఎన్టీఆర్ హిట్ అందుకున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఓ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశారు. రాజమౌళి సినిమాలో నటించిన హీరోల తదుపరి చిత్రాలు ఫెయిల్ అయ్యే సంస్కృతిని ఆయన తిరగరాశారు.