News October 5, 2024
బాత్రూమ్‌లోనే గుండెపోట్లు ఎక్కువ.. ఎందుకు?

US NCBI ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 11% గుండెపోటు మరణాలు బాత్రూమ్‌లోనే జరుగుతున్నాయి. స్నానం చేసేటప్పుడు శరీర ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల ఒత్తిడి ఏర్పడి రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుంది. మలబద్ధకం ఉన్న వారు ముక్కినప్పుడు రక్తం ఎక్కువ పీడనంతో ప్రవహిస్తుంది. అప్పుడు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని హృద్రోగ నిపుణులు చెబుతున్నారు.
Similar News
News March 5, 2026
అప్పుడు YSR-KVP.. ఇప్పుడు రేవంత్-వేం నరేందర్!

TG: సన్నిహితులకు MP పదవుల కేటాయింపులో YSR వ్యూహాన్ని సీఎం రేవంత్ అనుసరించినట్లు కనిపిస్తోంది. 2004లో YSR CM అయిన వెంటనే తన సన్నిహితుడు KVPని ప్రభుత్వ సలహాదారు(రాజకీయ)గా నియమించారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్‌ను ఒప్పించి ఆయనకు రాజ్యసభ సీటు ఇప్పించారు. రేవంత్ కూడా తొలుత వేం నరేందర్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా, ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు.
News March 5, 2026
నామినేషన్ వేసిన సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన వారిద్దరూ తమకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి, ఏఐసీసీ పెద్దలకు, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానని సింఘ్వీ వ్యాఖ్యానించారు.
News March 5, 2026
ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

ఏపీలో పదో తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. <


