News October 5, 2024

హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్ విడుదల

image

TG: హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చేశాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయగా తాజాగా అందుకు సంబంధించిన గెజిట్ విడుదలైంది. HYDలో చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే చట్టబద్ధత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

Similar News

News October 5, 2024

రూ.10 కాయిన్లు తీసుకోండి: SBI

image

రూ.10 కాయిన్స్‌ చెల్లడం లేదనే అపోహతో చాలామంది తీసుకోవడం లేదు. ఈ అపోహ తొలగించాలనే లక్ష్యంతో SBI వరంగల్ జోనల్ కార్యాలయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సమన్వయంతో ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంకు అధికారులు వ్యాపారులకు, ప్రజలకు రూ.10 నాణేలను పంపిణీ చేశారు. ₹10 కాయిన్స్ చెల్లుతాయని అందరూ స్వీకరించాలని కోరారు.

News October 5, 2024

దేశంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభ‌వం!

image

కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభవం ప్రారంభమైనట్టేనని హరియాణా, JK ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ అంచనాలు గనుక నిజమైతే దేశంలో కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయమని పేర్కొంటున్నారు.

News October 5, 2024

శాంసన్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఓపెనర్‌గా బరిలోకి

image

బంగ్లాదేశ్‌తో T20 సిరీస్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా వస్తారని కెప్టెన్ సూర్య కుమార్ ప్రకటించారు. సంజూతో అభిషేక్ శర్మ కూడా ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగుతారని చెప్పారు. కాగా ఈ సిరీస్‌లో రాణిస్తే సంజూకి జట్టులో స్థానం సుస్థిరమయ్యే అవకాశం ఉంది. అటు అతడికి ఛాన్సులు ఎక్కువగా రాకపోవడం, వచ్చినా ఉపయోగించుకోలేకపోవడంతో జట్టులో చోటుపై అనుమానాలు నెలకొన్నాయి. అందుకే ఈ సిరీస్ సంజూకి గోల్డెన్ ఛాన్స్ కానుంది.