News October 5, 2024
సెబీ చీఫ్ మాధబీ, ట్రాయ్ చీఫ్ లాహోటిలకు సమన్లు

సెబీ, ట్రాయ్‌ల పనితీరుపై పార్లమెంటు PAC ఈ నెల 24న సమీక్షించనుంది. ఈ మేరకు సెబీ చీఫ్ మాధబీ పురీ, ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటిలకు సమన్లు జారీ చేసింది. అయితే, ఈ సమీక్షకు రెండు సంస్థల నుంచి మాదబీ, లాహోటిల తరఫున సీనియర్ అధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కమిటీ పేర్కొంది. ఆర్థిక అవకతవకలపై ఇటీవల మాధబి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ ఈ సమీక్షకు ప్రాధాన్యం సంతరించుకుంది.
Similar News
News November 5, 2025
ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా మరికల్ అడవుల్లో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
News November 5, 2025
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

AP: అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు నుంచి వెళ్తున్న బస్సు చింతకుంట వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్టీరింగ్ స్టక్ కావడంతో ఇలా జరిగినట్లు సమాచారం. బస్సులో ఎక్కువగా ఆదర్శ పాఠశాల, జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
News November 5, 2025
ఒక్క సేఫ్టీ పిన్ ధర రూ.69వేలు!

వివిధ అవసరాలకు వాడే సేఫ్టీ పిన్ (పిన్నీసు/ కాంట) ఊర్లో జరిగే సంతలో, దుకాణాల్లో రూ.5కే డజను లభిస్తాయి. అయితే వాటికి దారాలు చుట్టి భారీ ధరకు అమ్మేస్తోంది లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘ప్రడా’ (Prada). చిన్న మెటల్ సేఫ్టీ పిన్ బ్రోచ్ ధర 775 డాలర్లు (సుమారు రూ. 69,114) ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతి సాధారణ వస్తువులనూ బ్రాండింగ్ చేస్తూ సంపన్నులను ఆకర్షిస్తున్నాయి ఈ కంపెనీలు. దీనిపై మీరేమంటారు?


