News October 5, 2024
హరియాణాలో అన్ని సర్వేలూ కాంగ్రెస్‌కే అనుకూలం

హరియాణాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని పీపుల్స్ పల్స్(45-50), CNN(59), రిపబ్లిక్ మ్యాట్రిజ్(55-62), దైనిక్ భాస్కర్(44-54) సంస్థలు అంచనా వేశాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు, ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగ సమస్యలు, అగ్నివీర్ అంశాలు, మహిళా రెజ్లర్ల అందోళన బీజేపీకి ప్రతికూలంగా మారినట్టు పేర్కొన్నాయి.
Similar News
News February 24, 2026
రైల్వేలో 22,195 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

రైల్వేలో 22,195 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు ఇప్పటివరకు అప్లై చేసుకోకపోతే మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.18వేలు చెల్లిస్తారు. CBT, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు రూ.250. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/
News February 24, 2026
తెలుగు సాహిత్యంలో మొలతాడు ప్రాధాన్యం

తెలుగు సాహిత్యంలో మొలతాడు ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద, శ్రీనాథుని శృంగార నైషధం గ్రంథాల్లో దీని ప్రస్తావన కనిపిస్తుంది. రామదాసు కీర్తనల్లో శత్రుఘ్నునికి పదివేల మొహరీల బంగారు మొలతాడు చేయించినట్లు పేర్కొన్నారు. బాలకృష్ణుడి అలంకరణలో తాయెత్తులు, మొలతాడు ప్రధానమైనవి. పుట్టిన 11వ రోజే ముంజ గడ్డి, లోహపు తాడుతో దీనిని కట్టడం రక్షణ కవచంలా భావిస్తారు. ఇది రాహు దోష నివారణకు కూడా సంకేతం.
News February 24, 2026
ఘోర ఓటమి.. టీమ్ ఇండియాలో భారీ మార్పులు?

T20WC సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత టీమ్ ఇండియాలో భారీ మార్పులు తప్పవని క్రీడావర్గాలు వెల్లడిస్తున్నాయి. వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ, తిలక్‌లలో ఒకరిని తప్పించి శాంసన్‌కు అవకాశం ఇస్తారని పేర్కొంటున్నాయి. అలాగే సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకుంటారని అంచనా వేస్తున్నాయి. బౌలింగ్ విభాగంలోనూ ఛేంజెస్ ఉండొచ్చంటున్నాయి. కాగా భారత్ ఈ నెల 26న జింబాబ్వేతో తలపడనుంది.


