News October 5, 2024

రూ.121 కోట్లు పెట్టి నంబర్ ప్లేట్ కొన్నాడు! ఎందుకంటే..

image

అబుదాబికి చెందిన వ్యాపారవేత్త సయీద్ 2008లో సుమారు రూ.121 కోట్లు వెచ్చించి ‘1’ అంకె ఉన్న నంబర్ రిజిస్ట్రేషన్‌ చేయించారు. పిచ్చి పని అంటూ అప్పట్లో విమర్శించిన వారే అది తెలివైన పెట్టుబడి అని ఇప్పుడు చెబుతున్నారు. అందుక్కారణం.. సింగిల్ డిజిట్ ప్లేట్స్ UAEలో మొత్తమ్మీద 63 మాత్రమే ఉన్నాయి. అందులోనూ ‘1’ అనేది అక్కడి శ్రీమంతులకి స్టేటస్ సింబల్. నేడు ఉన్న డిమాండ్‌కి ఆ నంబర్ విలువ రూ. 168కోట్లకు పైమాటే!

Similar News

News October 6, 2024

శుభ ముహూర్తం

image

తేది: అక్టోబర్ 6, ఆదివారం
శు.తదియ: ఉదయం 7.49 గంటలకు
విశాఖ: రాత్రి 12.11 గంటలకు
వర్జ్యం: ఉదయం 4.33 గంటలకు
దుర్ముహూర్తం: సా.4.16-5.04 గంటల వరకు

News October 6, 2024

TODAY HEADLINES

image

* AP: ఉచిత ఇసుకపై కావాలనే దుష్ప్రచారం: చంద్రబాబు
* TG: పేదలను ఎలా ఆదుకోవాలో సలహా ఇవ్వండి: CM
* TG: బతుకమ్మ అంటే ఈ ముఖ్యమంత్రికి గిట్టదా?: KTR
* TG:హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్ విడుదల
* పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన మోదీ
* హరియాణా, కశ్మీర్ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ హవా
* బంగ్లాతో టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ
* నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మరణం
* జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డ్ రద్దు

News October 6, 2024

సర్కారు డబ్బు కొట్టేసి 31సార్లు డిస్నీ వరల్డ్‌కి!

image

అమెరికాలో ఓ జంట ప్రభుత్వానికి రూ.4.2 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. ఆర్మీ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న థామస్ బౌచర్డ్(61) తన పలుకుబడిని ఉపయోగించి ప్రియురాలిని(53) ప్రభుత్వం జీతం ఇచ్చే సహాయకురాలిగా నియమించుకున్నారు. ప్రభుత్వ పని మీద అని చెప్పి ఇద్దరూ డిస్నీ వరల్డ్‌, ఇతర విలాసాలకు 31సార్లు తిరిగారు. ఎట్టకేలకు వారి బండారం బట్టబయలైంది. దీంతో అధికారులు వారు తిన్న డబ్బును వసూలు చేసే పనిలో పడ్డారు.