News October 5, 2024
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన ఎనుములపల్లి విద్యార్థులు

అనంతపురంలోని న్యూటౌన్ జూనియర్ కాలేజ్ మైదానంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన క్రీడా పోటీల్లో పుట్టపర్తి మున్సిపల్ పరిధి ఎనుములపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. బాల్ బ్యాడ్మింటన్ అండర్-14, 17 విభాగాల్లో గౌతమి, కౌశిక్ రెడ్డి, విజయ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ రమేశ్ బాబు తెలిపారు. వీరు పశ్చిమగోదావరి జిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
Similar News
News July 7, 2025
పామిడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

పామిడిలోని జగన్నాథ పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
News July 7, 2025
‘రాష్ట్రంలో అనంత జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.
News July 7, 2025
పామిడి: ‘నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

పామిడి మండల కేంద్రంలోని పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.