News October 5, 2024
ADB: గ్రేట్.. ఒకేసారి మూడు ఉద్యోగాలు
ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికై ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓరగంటి ప్రశాంత్ ప్రభంజనం సృష్టించాడు. పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఓరగంటి రాజన్న, విజయ దంపతుల కుమారుడు ప్రశాంత్(32) ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో SA(సోషల్), LP(తెలుగు)తో పాటు SGT ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు. కష్టపడి చదివి మూడు ఉద్యోగాలు సంపాదించడంతో ఆయన్ను పలువురు అభినందించారు.
Similar News
News January 2, 2025
ADB: పెద్దపులి దొరికిందోచ్..!
ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పులిని అటవీ అధికారులు పట్టుకున్నారు. సిర్పూర్(టి) మాకిడి అటవీ ప్రాంతానికి 7కి.మీ దూరంలోని మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ఆత్మారాంగుడా సమీపంలో అక్కడి ఫారెస్ట్ అధికారులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. కాగా గతేడాది నవంబర్ 29న కాగజ్‌నగర్ గన్నారంలోని ఓ పొలంలో పనులు చేస్తున్న లక్ష్మిపై పులి దాడి చేసింది. కాగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
News January 2, 2025
విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాలి: ASF కలెక్టర్
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. బుధవారం టీఎస్‌యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సమాజ నిర్మాణం తరగతి గదిలోనే ప్రారంభమవుతుందన్నారు. సామాజిక స్పృహ కలిగిన సంఘంగా కొత్త ఏడాదిలో నవ ఉత్తేజంతో పనిచేయాలని సూచించారు.
News January 1, 2025
నిర్మల్: ‘కేజీబీవీ విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు’
కేజీబీవీ ఉపాధ్యాయుల సమ్మె కారణంగా విద్యార్థులు తమ చదువును నష్టపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని డీఈవో రామారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు బోధిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఏ రకమైన సమస్యలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.