News October 5, 2024

మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

image

TG: మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. సెర్ప్ సీఈవో ఛైర్మన్‌గా 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అటు మూసీ నిర్వాసితులకు ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News March 11, 2026

భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ స్టవ్స్‌ సేల్స్.. NO STOCK

image

గ్యాస్ కొరత నేపథ్యంలో ఇండక్షన్ స్టవ్స్‌కు డిమాండ్ పెరిగిపోయింది. ఎలక్ట్రిక్ ప్రెజర్ కుకర్స్‌, రైస్ కుకర్స్‌ను విపరీతంగా కొనేస్తున్నారు. బ్లింకిట్, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు 2-3 రోజులుగా ఆర్డర్లు పోటెత్తుతున్నాయి. ఒక్క ఫ్లిప్‌కార్ట్‌లోనే 300% సేల్స్ పెరిగాయి. దీంతో వాటిలో sold out, out of stock బోర్డులు కనిపిస్తున్నాయి. దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. ఎలక్ట్రిక్ స్టవ్స్‌ మీరూ కొంటున్నారా?

News March 11, 2026

APPLY: డిగ్రీతో నెలకు రూ.50వేల జీతం

image

IDBIలో 1,300 పోస్టులకు ఈ నెల 19న దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. జూ.అసిస్టెంట్ మేనేజర్ ‘గ్రేడ్-ఓ’ ఉద్యోగాలకు డిగ్రీలో కనీసం 60% ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ‘గ్రేడ్-ఏ’ పోస్టులకు డిగ్రీతో పాటు బ్యాంకింగ్ సెక్టార్‌లో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. 1 మార్చి 2026 నాటికి వయసు 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది.
వెబ్‌సైట్: <>idbi.bank.in<<>>

News March 11, 2026

‘ధురంధర్-2’ రన్‌టైమ్ ఎఫెక్ట్.. టికెట్ రేట్లు పెరుగుతాయా?

image

‘ధురంధర్-2’పై భారీ అంచనాలు నెలకొన్న వేళ ఆ మూవీ రన్‌టైమ్ 3 గంటల 55 నిమిషాలు (దాదాపు 4 గంటలు) ఉండటం చర్చనీయాంశమైంది. ఇది మల్టీప్లెక్సులకు సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. భారీ రన్‌టైమ్ వల్ల షోల సంఖ్య తగ్గిపోతుందని.. ఫలితంగా డైలీ గ్రాస్‌పై ఎఫెక్ట్ పడుతుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. దానిని భర్తీ చేసేందుకు టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఆడియన్స్‌కు భారంగా మారుతుంది.