News October 6, 2024

న్యూతిన్ సూకియా, SMVT రైళ్లకు కొత్తవలసలో హాల్ట్

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైలు నంబర్స్ 05952 /05951 న్యూతిన్ సూకియా నుంచి ఎస్.ఎం.వి.టి బెంగళూరు ఈ నెల 7న, డిసెంబర్ 26 వరకు ప్రతి గురువారం సాయంత్రం 6.45 న్యూటిన్ సూకియాలో బయలుదేరి కొత్తవలస శనివారం మధ్యాహ్నం 2.05 చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఎస్.ఎం.వీ.టీ. బెంగళూరులో ఈనెల 11న, డిసెంబర్ 30 వరకు ప్రతి ఆదివారం అర్ధరాత్రి 00.30 బయలుదేరి సోమవారం రాత్రి 10.20 కొత్తవలస చేరుతుందని తెలిపారు.

Similar News

News March 12, 2026

జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదు: జేసీ

image

జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, గృహ అవసరాలకు గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ కొరత వార్తలు అవాస్తవమన్నారు. గ్యాస్ బుకింగ్‌కు 25 రోజుల గడువు మాత్రమే ఉంటుందని, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.

News March 12, 2026

రైతుల ఖాతాల్లో రూ.127.63 కోట్లు జమ: VZM కలెక్టర్

image

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం మూడవ విడత నిధులు శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఒక్కో రైతుకు రూ.6,000 చొప్పున అందించనున్నారు. జిల్లాలో 2,27,700 మంది రైతులకు సుమారు రూ.127.63 కోట్లు జమ కానున్నాయని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ నిధులను రైతులు పంట సాగు అవసరాలకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

News March 12, 2026

అధిక వడ్డీలతో వేదిస్తే కఠిన చర్యలు: VZM ఎస్పీ

image

అధిక వడ్డీలతో ప్రజలను వేదిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయనగరం ఎస్పీ దామోదర్ గురువారం హెచ్చరించారు. కాల్ మనీ పేరుతో వేధింపులకు పాల్పడిన, అధిక వడ్డీలు వసూలు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేరే జిల్లాలకు చెందిన వ్యక్తులు జిల్లాకు వచ్చి ప్రజల అవసరాలను గుర్తించి అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వేదిస్తున్నట్లు తెలిసిందని, అటువంటి వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.