News October 6, 2024
బీజేపీకి ఓటు వేయాలని కోరిన డేరా చీఫ్

అత్యాచారం కేసులో పెరోల్‌పై విడుదలైన డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ హరియాణా ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాల్సిందిగా తన మద్దతుదారులను కోరడం వివాదం రేపింది. సిర్సాలోని సత్సంగ్‌లో శనివారం జరిగిన సమావేశంలో బహిరంగంగా కాకుండా సమూహంలో కలిసిపోయిన తన అనుయాయుల ద్వారా బీజేపీకి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. ప్రతిఒక్కరూ ఐదుగురిని పోలింగ్ బూత్‌కు తరలించాలని కూడా కోరినట్టు తెలిసింది.
Similar News
News July 5, 2025
DECLARE ఇవ్వరా? కెప్టెన్ మదిలో ఏముంది?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆధిక్యం 565 పరుగులు దాటింది. కానీ భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. రేపు ఒక రోజు మాత్రమే ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేట్‌గా డిక్లేర్ ఇస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉందని చర్చించుకుంటున్నారు. భారత్ మరీ ఆత్మరక్షణ ధోరణి కనబరుస్తోందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News July 5, 2025
సింగరేణి 136 ఏళ్ల చరిత్రలో తొలిసారి..

TG: 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా ఇందులో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటైంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. విపత్తు సమయంలో ధైర్యంగా, నైపుణ్యంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బృందానికి అభినందనలు తెలిపారు.
News July 5, 2025
కరుణ్ ‘ONE MORE’ ఛాన్స్ ముగిసినట్లేనా?

టీమ్ ఇండియా ప్లేయర్ కరుణ్ నాయర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జట్టులో ఇతర సభ్యులను కాదని అతడిని ఆడిస్తే మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన కరుణ్ బాధ్యతారహితంగా ఆడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో టెస్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.