News October 6, 2024

పరగడుపునే ఈ పండు తింటే..

image

ఉదయం లేవగానే బొప్పాయి పండు తినడం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలోని హానికర టాక్సిన్లు బయటికి వెళ్తాయి. జీర్ణక్రియ బాగా పనిచేసి, మలబద్ధకం అనే సమస్య ఉండదు. శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే కెఫిన్ యాసిడ్, మైరిసెటిన్, విటమిన్ సి, ఎ, ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే గర్భిణులు దీన్ని పరగడుపున తీసుకోకపోవడం మంచిది.

Similar News

News February 5, 2026

వారికి తెలిసే తప్పు చేశారు: పవన్

image

AP: వేంకటేశ్వరుడి ముందు మోకరిల్లి YCP వాళ్లు క్షమాపణలు చెప్పాలని Dy.CM పవన్ డిమాండ్ చేశారు. ‘ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ రాలేదు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నితమైన అంశం. 2022లోనే కల్తీ కలిసిందని రిపోర్టులు వస్తే వాటిని తొక్కిపెట్టారు. వాళ్లకి అంతా తెలిసే చేశారు. తిరుమలకు 2 కొండలు చాలు అనే ధోరణి నుంచి వచ్చిన పార్టీ మీది. రథం కాలిపోతే పిచ్చోడు చేశారు అంటారు’ అని వ్యాఖ్యానించారు.

News February 5, 2026

ICAR-IARIలో ఉద్యోగాలు

image

ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(<>IARI<<>>) 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు దరఖాస్తును ఈ-మెయిల్ dk6473@gmail.comకు FEB 28 వరకు సెండ్ చేయాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MSc/MTech/ME/MCA/PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iari.res.in/

News February 5, 2026

YCP భగవంతుడిపై పగ పట్టింది: పవన్

image

AP: YCP హయాంలో హిందూత్వంపై అనేక దాడులు జరిగాయని Dy.CM పవన్ పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి మీడియా సమావేశం నిర్వహించింది. ‘వీళ్లు భగవంతుడిపై పగబట్టారు. 59.70 లక్షల కిలోల కల్తీ పామాయిల్‌తో చేసిన కోట్ల లడ్డూల్లో కొన్ని అయోధ్య కూడా పంపారు. వీళ్లు చెప్పిన కల్తీ నెయ్యికి సంబంధించి ఆన్ రికార్డ్ సాక్ష్యాలు కూడా దొరికాయి. భగవంతుడిపై పగబట్టిన వాళ్లు సర్వనాశనం అయిపోతారు’ అని పేర్కొన్నారు.