News October 6, 2024

సర్కారు డబ్బు కొట్టేసి 31సార్లు డిస్నీ వరల్డ్‌కి!

image

అమెరికాలో ఓ జంట ప్రభుత్వానికి రూ.4.2 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. ఆర్మీ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న థామస్ బౌచర్డ్(61) తన పలుకుబడిని ఉపయోగించి ప్రియురాలిని(53) ప్రభుత్వం జీతం ఇచ్చే సహాయకురాలిగా నియమించుకున్నారు. ప్రభుత్వ పని మీద అని చెప్పి ఇద్దరూ డిస్నీ వరల్డ్‌, ఇతర విలాసాలకు 31సార్లు తిరిగారు. ఎట్టకేలకు వారి బండారం బట్టబయలైంది. దీంతో అధికారులు వారు తిన్న డబ్బును వసూలు చేసే పనిలో పడ్డారు.

Similar News

News January 25, 2026

అభిమానికి గోల్డ్ చైన్ ఇచ్చిన రజినీకాంత్

image

సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానికి బంగారు గొలుసు ఇచ్చారు. మధురైలో పేదల కోసం కేవలం రూ.5కే పరోటా విక్రయిస్తున్న ‘రజినీ శేఖర్’ సేవలను ప్రశంసించారు. శేఖర్ కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీతో బిజీగా ఉండగా, ఏప్రిల్ నుంచి సిబి చక్రవర్తి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

News January 25, 2026

అసెంబ్లీ గందరగోళంపై రాష్ట్రపతికి నివేదిక

image

కర్ణాటక అసెంబ్లీలో జరిగిన <<18923034>>గందరగోళం<<>>పై ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ రాష్ట్రపతి ముర్ముకు నివేదిక సమర్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు ఉన్న కారణంగా ప్రసంగ ముసాయిదాలోని 2 నుంచి 11 పేరాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించానని తెలిపారు. అదే విధంగా ప్రసంగం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని నివేదికలో పేర్కొన్నారు.

News January 25, 2026

ముద్దు సీన్లకు భయపడే ఛాన్స్‌లు వదులుకున్నా: సోనమ్ బజ్వా

image

ముద్దు సన్నివేశాల్లో నటించాలనే భయంతోనే బాలీవుడ్‌ అవకాశాలు వదులుకున్నానని నటి సోనమ్ బజ్వా అన్నారు. ‘‘ముద్దు సీన్లలో నటిస్తే పంజాబ్‌లో ఇమేజ్‌ ఏమవుతుందోనని భయపడ్డాను. నా ఫ్యామిలీ ఎలా అర్థం చేసుకుంటుందో, అభిమానులు ఏమనుకుంటారో అనుకున్నాను. పేరెంట్స్‌తో డిస్కస్ చేయడానికి సిగ్గుపడ్డాను. చివరికి అడిగితే ‘సినిమా కోసమేగా. తప్పేముంది’ అనడంతో షాకయ్యాను’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.