News October 6, 2024
ఖరీఫ్ పంటల సాగు, సమస్యలపై శాస్త్రవేత్తల సమావేశం

బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో ఖరీఫ్ సీజన్ పంటల సాగు, సమస్యల గురించి ప్రధాన శాస్త్రవేత్త విజయ శంకర్ బాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఖరీఫ్ సీజన్‌లో జులై, సెప్టెంబర్ మాసాలలో తక్కువ వర్షపాతం వల్ల దిగుబడులు తక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Similar News
News March 12, 2026
అనంత: పరీక్షలకు 286 మంది డుమ్మా!

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్ష జరిగింది. ఈ రోజు పరీక్షలకు సెట్-I ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 5,223 గాను 4,937 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 286 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామన్నారు.
News March 12, 2026
అనంతపురంలో YCP ఆవిర్భావ వేడుకలు

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా పార్టీ అడుగులు వేస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News March 12, 2026
ప్రత్యేక అధికారులను నియమించనున్న జిల్లా కలెక్టర్

అనంతపురం జిల్లాలో గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించే అధికారాన్ని కలెక్టర్ ఆనంద్‌కు కట్టబెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2 నాటికి ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక డీపీఓలు రూపొందించిన జాబితా మేరకు కలెక్టర్ అధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.


