News October 6, 2024

హరియాణాలో మాదే అధికారం: సీఎం సైనీ

image

హరియాణాలో ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ తిరిగి తామే అధికారంలోకి వస్తామని సీఎం నయబ్ సింగ్ సైనీ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. తాము అన్ని రంగాల్లో పనులు చేశామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించారని పేర్కొన్నారు. హరియాణాను వారసత్వం, ప్రాంతీయతత్వం నుంచి వేరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా 90 స్థానాలకు ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Similar News

News March 23, 2026

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురికి పోలీస్ కస్టడీ

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ రాజేంద్రనగర్ కోర్టు తీర్పునిచ్చింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితేశ్ రెడ్డి, నమిత్ శర్మను మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది. ఇవాళ సా.4:30 గంటల నుంచి మార్చి 26 సా.4:30 గంటల వరకు కస్టడీకి అనుమతించింది. విచారణను ఉ.6 గంటల తర్వాత మాత్రమే నిర్వహించాలని, సా.7 గంటల తర్వాత చేయవద్దని కోర్టు ఆదేశించింది.

News March 23, 2026

పాక్ క్రికెట్ లీగ్‌పై ఐస్‌లాండ్ సెటైర్లు!

image

పశ్చిమాసియా సంక్షోభం, దేశంలో ఇంధన కొరత నేపథ్యంలో 2 వేదికల్లో, ప్రేక్షకులు లేకుండానే PSL <<19452212>>నిర్వహించాలని<<>> పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించడం తెలిసిందే. దీనిపై ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు సెటైర్లు వేసింది. ‘PSL రాబోతోంది. మిలియన్ల మంది క్రికెట్ అభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. PSL అంటే ఏంటా అని మేం ఆశ్చర్యపోయేవాళ్లం. అయితే దానర్థం పెట్రోల్ షార్టేజ్ లీగ్ అని తేలింది’ అంటూ ట్వీట్ చేసింది.

News March 23, 2026

బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి?

image

సాధారణంగా షేర్ మార్కెట్ పడిపోతే బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతుంటుంది. కానీ వార్ మొదలయ్యాక ఇవీ క్రాష్ అవుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదే జరిగితే స్థిర లాభాలను ఇచ్చే బాండ్లకు డిమాండ్ పెరుగుతుంది. పైగా ఇటీవల బంగారం, వెండి గరిష్ఠాలను తాకాయి. లిక్విడిటీ కొరత కూడా ఉంది. ఈ పరిస్థితిని మదుపర్లు క్యాష్ చేసుకుంటుండటంతో ధరలు తగ్గుతున్నాయి.