News October 6, 2024

డీఎస్సీ సర్టిఫికెట్ పరిశీలన పూర్తి

image

TG: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఒక్కో ఉద్యోగానికి 1:3 చొప్పున 25,924 మందిని వెరిఫికేషన్‌కు పిలవగా 24,466 మంది హాజరయ్యారు. మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్ కోటాలో టీచర్ పోస్టులకు కొన్ని జిల్లాలో వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు. కాగా డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈ నెల 9న LB స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ అందజేయనున్నారు.

Similar News

News October 6, 2024

ఘోరం.. కుటుంబంలో ఒక్కడే మిగిలాడు!

image

AP: ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబంలో చీకట్లు నింపింది. చిత్తూరు జిల్లాలోని జీడీనెల్లూరుకు చెందిన దినేశ్ బెట్టింగ్‌కు అలవాటు పడి ఏడాది క్రితం ఇంటి స్థలాన్ని అమ్మేశాడు. అయినా వదలక మరిన్ని అప్పులు చేశాడు. సొంతింటిపై లోన్ కోసం ప్రయత్నించాడు. అప్పు తీర్చే మార్గం లేక దినేశ్, తండ్రి నాగరాజుల రెడ్డి, తల్లి జయంతి, సోదరి సునీత శుక్రవారం పురుగు మందు తాగారు. ముగ్గురు చనిపోగా, దినేశ్ పరిస్థితి విషమంగా ఉంది.

News October 6, 2024

TTDకి లక్ష గోవులను ఉచితంగా సమకూరుస్తా: రామచంద్రయాదవ్

image

AP: తిరుమలలో ప్రసాదాల తయారీకి నెయ్యి పరిష్కారం కోసం సొంత డెయిరీని ఏర్పాటుచేయాలని సీఎం చంద్రబాబును BCY పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ కోరారు. దీనికి ప్రభుత్వం సిద్ధమైతే తాను వెయ్యి గోవులను ఇస్తానని లేఖ రాశారు. మరో లక్ష ఆవులను ఉచితంగా సమకూరుస్తానని చెప్పారు. ‘వీటితో రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల పాలు వస్తాయి. ఇందులో నుంచి 50వేల కేజీల వెన్న తీసి 30వేల కేజీల నెయ్యి తయారుచేయొచ్చు’ అని పేర్కొన్నారు.

News October 6, 2024

రూ.2,000 రావాలంటే ఇలా చేయాల్సిందే..

image

ప్రధాని మోదీ నిన్న పీఎం కిసాన్ 18వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈకేవైసీ పూర్తైన అకౌంట్లలో మాత్రమే రూ.2వేలు జమయ్యాయి. ఇంకా ఎవరికైనా జమ కాకుంటే PM కిసాన్ పోర్టల్ ద్వారా OTP ఎంటర్ చేసి KYC పూర్తి చేసుకోవచ్చు. లేదంటే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.
>>SHARE IT