News October 6, 2024

HYD: 2,525 చెరువులకు హద్దులు ఖరారు

image

HYD మహా నగరంలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని పర్యావరణవేత్తలు FTL, బఫర్ జోన్లను నిర్ధారించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెచ్ఎండీఏలోని 3,532 చెరువుల్లో 230కి మాత్రమే బఫర్ జోన్ నిర్ధారించారు. 2,525 చెరువులకు హద్దులు ఖరారు చేశారు. కాగా మరో 1,000 చెరువులకు 3 నెలల్లో హద్దులను నిర్ధారించాల్సి ఉంది.

Similar News

News March 4, 2026

HYD: మెట్రో హంగులకు ఇక గుడ్-బై!

image

L&T చేతిలో ఉన్న HYD మెట్రో ఫేజ్-1 ఇక పక్కా ప్రభుత్వ ఆస్తి కాబోతోంది. MAR 31 నాటికి అప్పగింత పూర్తి కావాల్సిందేనని CS నుంచి డెడ్ లైన్ వచ్చింది. సుమారు రూ.15,000 కోట్ల భారీ డీల్ ఇది. ఈ డబ్బు కోసం ప్రభుత్వం ఇప్పుడు IRFC దగ్గర తక్కువ వడ్డీకి అప్పు కోసం తిరుగుతోంది. ప్రభుత్వ మెట్రోలో సామాన్యుడికి టికెట్ ధరలు తగ్గుతాయా?, కనీస మెయింటెనెన్స్ లేక మెట్రో ‘ఆర్టీసీ’లా మారుతుందా? అని జనం టెన్షన్ పడుతున్నారు.

News March 4, 2026

3 ముక్కల HYD.. ‘గ్రేటర్’ కథ కంచికే!

image

FEB 10తో GHMC కౌన్సిల్ పదవీకాలం ముగియడమే ఆలస్యం.. సర్కారు సిటీని 3 ముక్కలు చేస్తూ GO నం. 55 ఇచ్చేసింది. ఈ ముక్కలాట వెనుక అసలు కిటుకు వార్డుల పునర్విభజన. పాతబస్తీ పట్టు తగ్గించి కొత్త ఏరియాల్లో పొలిటికల్ పవర్ మార్చడమే అసలు ప్లాన్ అని విశ్లేషకులు అంటున్నారు. ఏటా రూ.2,000 కోట్ల ట్యాక్స్ కట్టే IT ఏరియా CYB కిందకి వెళ్లడంతో GHMC డెవలప్‌మెంట్ కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారో? అన్నది సవాల్‌గా మారింది.

News March 4, 2026

ఇరాన్‌తో HYDకు స్పెషల్ ATTACHMENT..!

image

ఇరాన్‌తో HYDకు విడదీయరాని అనుబంధం ఉంది. బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం, జామున్, జిలేబీ, సమోసా ఇరానీలు పరిచయం చేసినవే. గోల్కొండ, చార్మినార్ చారిత్రక కట్టడాల్లోనూ పర్షియన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇక్కడి తెలుగు, ఉర్దూ భాషలపైనా ఇరాన్ పదాల ప్రభావం ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ పేరుతో బంజారాహిల్స్‌లో కాన్సులేట్, రోడ్డు, పాతబస్తీలో ఇరానీ గల్లీ కూడా ఉందంటే ఇరాన్‌తో HYDకున్న రిలేషన్‌ను అర్థం చేసుకోవచ్చు.