News October 6, 2024
ENCOUNTER: మృతుల్లో 13 మంది మహిళలు

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించగా, అందులో 13 మంది మహిళలు ఉన్నారని బస్తర్ ఐజీ సుందర్ రాజన్ వెల్లడించారు. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ PLGA 6 బెటాలియన్ సభ్యులని తెలిపారు. అందులో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ తూర్పు బస్తర్ ఇన్ఛార్జ్ నీతి అలియాస్ ఊర్మిళ కూడా ఉన్నారని, ఆమెపై రూ.25 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు.
Similar News
News March 5, 2025
నల్గొండ జిల్లాలో 52 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 28,722 మంది పరీక్ష రాయనున్నారు.
News March 5, 2025
అట్లీ-అల్లు అర్జున్ మూవీలో ఐదుగురు హీరోయిన్లు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మెయిన్ ఫీమేల్ లీడ్‌గా జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం. అమెరికన్, కొరియన్ హీరోయిన్లను కూడా తీసుకోవాలని అట్లీ భావిస్తున్నట్లు టాక్. ఈ సినిమా కోసం బన్నీ విదేశీ శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు.
News March 5, 2025
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన అక్కడ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఇవాళ రాత్రి తిరిగి వైజాగ్ చేరుకుంటారు. రేపు ఉదయం తన తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటారు. మళ్లీ 6వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తారు. 7న ఢిల్లీ నుంచి తిరిగి అమరావతి చేరుకుంటారు.