News October 6, 2024

JK: పాక్ ఆయుధాలు, బాంబుల్ని సీజ్ చేసిన ఆర్మీ

image

JK పూంఛ్ జిల్లాలోని జుల్లాస్ ఏరియాలో డేంజరస్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. నమ్మదగిన వారి సమాచారంతో భారత సైన్యం రోమియోఫోర్స్ శనివారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది. అనుమానిత టెర్రరిస్టు బ్యాగును స్వాధీనం చేసుకుంది. ఇందులో AK 47, పాకిస్థానీ పిస్టల్, RCIED, టైమ్ బాంబులు, స్టవ్ IED, IED పరికరాలు, చైనీస్ గ్రెనేడ్లు ఉన్నాయి. ఇవన్నీ రెడీ టు యూజ్ మోడ్‌లో ఉన్నాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Similar News

News March 18, 2026

24 గంటల్లోనే అణుబాంబు వేసేవారు: ట్రంప్

image

ఇరాన్‌పై దాడి చేయకపోయి ఉంటే వారు అణుబాంబును తయారు చేసుకునేవారని ట్రంప్ అన్నారు. అదే జరిగితే 24 గంటల్లోనే దాన్ని ప్రయోగించి ఉండేవారని పేర్కొన్నారు. ఇది కేవలం పశ్చిమాసియాలోనే గాక యూరప్ వరకు పాకి ఉండేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు అమెరికా నేషనల్ కౌంటర్‌టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ <<19409994>>రాజీనామాపై<<>> స్పందిస్తూ.. భద్రతాపరమైన విషయంలో ఆయన చాలా వీక్ అని, వెళ్లిపోవడమే మంచిదైందని వ్యాఖ్యానించారు.

News March 17, 2026

IPL-2026: చెన్నై తుది జట్టు ఇదేనా?

image

IPL-2026: గత కొన్ని సీజన్లతో పోలిస్తే ఈసారి చెన్నై జట్టులో యువరక్తం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో తుది జట్టు ఎలా ఉండనుందనే ఆసక్తి నెలకొంది. క్రికెట్ విశ్లేషకుల అంచనా ఇది..
CSK: ఆయుష్ మాత్రే, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(C), బ్రెవిస్, కార్తీక్ శర్మ, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, ధోనీ, నాథన్ ఇల్లిస్, నూర్ అహ్మద్, హెన్రీ/ఖలీల్ అహ్మద్.

News March 17, 2026

EAPCET దరఖాస్తు గడువు మరోసారి పెంపు

image

AP EAPCET దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా మరోసారి ఈ నెల 24 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 24వ తేదీ వరకూ <>అప్లై<<>> చేసుకోవచ్చు. రూ.1000 లేట్ ఫీజుతో ఈ నెల 28, రూ.2వేలతో ఏప్రిల్ 1, రూ.4వేలతో ఏప్రిల్ 6, రూ.10,000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 11 నుంచి 13 వరకు అప్లికేషన్లలో కరెక్షన్స్ చేసుకోవచ్చు.