News October 6, 2024
World Bankకు సలహాలిచ్చే స్థాయికి భారత్: ఫేమస్ ఎకానమిస్ట్
సలహాలు తీసుకోవడం మానేసి ప్రపంచ బ్యాంకుకే సలహాలు ఇచ్చే స్థితికి భారత్ చేరిందని ఎకానమిస్ట్ జగదీశ్ భగవతి అన్నారు. ‘మనమిప్పుడు సరికొత్త యుగానికి చేరాం. నాయకత్వమే కీలకం. గతంలో పాలసీలు, ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా దేశం వెనకబడే ఉండేది. కరెక్ట్ టైమ్‌లో మోదీ PM కావడం అదృష్టం. వ్యవస్థలు మారాలని ఆయన ముందు నుంచే చెప్తున్నారు. కేంబ్రిడ్జ్ సహా మేధావులకు లేని కన్విక్షన్ ఆయన సొంతం. అందుకే ఆయనిష్టం’ అని చెప్పారు.
Similar News
News January 2, 2025
సాగు చట్టాలను దొడ్డిదారిన తెచ్చే ప్రయత్నం: కేజ్రీవాల్
గతంలో రద్దు చేసిన సాగు చట్టాలనే కేంద్రం ‘విధానాల’ పేరుతో దొడ్డిదారిన అమలు చేయడానికి సిద్ధమవుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. మూడేళ్ల క్రితం రైతులకు ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. హామీల సాధనకు ఉద్యమించిన పంజాబ్ రైతులకు ఏదైనా జరిగితే ఎన్డీయే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతులతో మాట్లాడకపోవడానికి బీజేపీకి ఎందుకంత అహంకారం అని ఆయన ప్రశ్నించారు.
News January 2, 2025
ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిశోర్
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పట్నాలోని గాంధీ మైదాన్‌లో దీక్ష ప్రారంభించిన PK మరోసారి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోస్టుల్ని అమ్మకానికి పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. Dec 13న జరిగిన 70వ BPSC ప్రిలిమినరీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
News January 2, 2025
2 ఎకరాలతో రూ.931 కోట్లు ఎలా?: రోజా
AP: చంద్రబాబు దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలవడంపై మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ‘ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం సుమారు రూ.1,000 కోట్లతో దేశంలో అత్యంత ఆస్తి కలిగిన సీఎంగా చంద్రబాబు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా 2 ఎకరాల ఆసామి కొడుకు అయిన చంద్రబాబు రూ.931 కోట్లు ఎలా సంపాదించారు?’ అని ట్వీట్ చేశారు.