News October 6, 2024
రూ.2,000 రావాలంటే ఇలా చేయాల్సిందే..

ప్రధాని మోదీ నిన్న పీఎం కిసాన్ 18వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈకేవైసీ పూర్తైన అకౌంట్లలో మాత్రమే రూ.2వేలు జమయ్యాయి. ఇంకా ఎవరికైనా జమ కాకుంటే PM కిసాన్ పోర్టల్ ద్వారా OTP ఎంటర్ చేసి KYC పూర్తి చేసుకోవచ్చు. లేదంటే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.
>>SHARE IT
Similar News
News March 5, 2025
అట్లీ-అల్లు అర్జున్ మూవీలో ఐదుగురు హీరోయిన్లు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మెయిన్ ఫీమేల్ లీడ్‌గా జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం. అమెరికన్, కొరియన్ హీరోయిన్లను కూడా తీసుకోవాలని అట్లీ భావిస్తున్నట్లు టాక్. ఈ సినిమా కోసం బన్నీ విదేశీ శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు.
News March 5, 2025
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన అక్కడ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఇవాళ రాత్రి తిరిగి వైజాగ్ చేరుకుంటారు. రేపు ఉదయం తన తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటారు. మళ్లీ 6వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తారు. 7న ఢిల్లీ నుంచి తిరిగి అమరావతి చేరుకుంటారు.
News March 5, 2025
ఒకటో తేదీనే మిడ్ డే మీల్ బిల్లులు

TG: స్కూళ్లలో మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రతినెలా ఒకటో తేదీనే బిల్లులు చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. తొలుత పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ప్రతినెలా ఎంత మంది విద్యార్థులు భోజనం చేశారో MDM యాప్‌లో నమోదు చేయగానే బిల్లు జనరేట్ అయ్యేలా మార్పులు చేయనుంది. బిల్లుకు HM, MEO ఆమోదం తెలపగానే ఖాతాల్లో బిల్లు మొత్తం జమ అవుతుంది.