News October 6, 2024
ఘోరం.. కుటుంబంలో ఒక్కడే మిగిలాడు!

AP: ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబంలో చీకట్లు నింపింది. చిత్తూరు జిల్లాలోని జీడీనెల్లూరుకు చెందిన దినేశ్ బెట్టింగ్‌కు అలవాటు పడి ఏడాది క్రితం ఇంటి స్థలాన్ని అమ్మేశాడు. అయినా వదలక మరిన్ని అప్పులు చేశాడు. సొంతింటిపై లోన్ కోసం ప్రయత్నించాడు. అప్పు తీర్చే మార్గం లేక దినేశ్, తండ్రి నాగరాజుల రెడ్డి, తల్లి జయంతి, సోదరి సునీత శుక్రవారం పురుగు మందు తాగారు. ముగ్గురు చనిపోగా, దినేశ్ పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News November 7, 2025
తేనె మోతాదు మించితే మహా ప్రమాదం

ఆరోగ్యానికి మంచిదని ఇటీవల తేనెను ఎక్కువమంది స్వీకరిస్తున్నారు. అయితే దాని మోతాదు మించితే మొదటికే మోసమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని అధిక ఫ్రక్టోజ్ వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. శరీరంలోని విషపదార్థాల తొలగింపులో కాలేయానిది ప్రధాన పాత్ర. అధిక తేనెతో దానిలో కొవ్వు పేరుకుపోయి పనితీరును నష్ట పరుస్తుంది. ఫలితంగా ఇతర సమస్యలూ వస్తాయి. అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ వల్ల బరువు పెరుగుతారు.
News November 7, 2025
చెట్టు నుంచి అరటి గెలలు ఎందుకు ఊడి పడిపోతాయి?

ఒక్కోసారి తోటలలోని కొన్ని అరటి చెట్ల నుంచి గెలలు హఠాత్తుగా ఊడి కిందకు పడిపోతుంటాయి. పంటకు సరైన పోషకాలు అందనప్పుడు, నీటి సదుపాయం ఎక్కువ లేదా తక్కువ అయినప్పుడు ఇలా జరుగుతుంది. అలాగే తక్కువ సూర్యకాంతి తగలడం, ఎక్కువ నీటిని పంటకు పెట్టడం, కాల్షియం లోపం కూడా దీనికి కారణమంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు గాలులు, గెల ఆనిన కొమ్మ విరగడం, గెల బరువు ఎక్కువగా ఉండటం కూడా గెల ఊడటానికి కారణమవుతాయి.
News November 7, 2025
కుప్పకూలిన ATC వ్యవస్థ.. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం

ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల్లో ATC వ్యవస్థ కుప్పకూలింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో సుమారు 500, ముంబైలో 200 ఫ్లైట్స్‌పై ప్రభావం పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సైబర్ అటాక్‌లో భాగమైన <<18227204>>జీపీఎస్ స్పూఫింగే<<>> దీనికి కారణమని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


