News October 6, 2024
GREAT.. జనగామ: ఒకే ఇంట్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

ఒకే ఇంట్లో అన్నా చెల్లెలు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బల్ల పద్మ-సోమయ్య కొడుకు మహేశ్ కుమార్, కూతురు మౌనికలు ఇటీవల విడుదలైన డీఎస్సీ(SGT) ఫలితాల్లో వరుసగా 5, 15వ ర్యాంక్‌లు సాధించారు. తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లి బీడీలు చేసి వీరిని చదివించింది.
Similar News
News March 13, 2026
గ్యాస్ సరఫరాపై అపోహలు వద్దు: కలెక్టర్

గ్యాస్ సిలిండర్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలకు, ఆశ్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
News March 12, 2026
వరంగల్: ప్రజా పాలనపై ప్రజాప్రతినిధులకు అవగాహన: కలెక్టర్

ప్రజా పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శాఖల వారీగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరించాలని స్పష్టం చేశారు. పాలనలో పారదర్శకత పెంచడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
News March 11, 2026
WGL: ఆస్పత్రుల లైసెన్స్ రెన్యువల్ ఆలస్యం..!

WGL నగరంతో పాటు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ల లైసెన్స్ రెన్యువల్ అంశం వివాదంగా మారింది. జిల్లాలో సుమారు 170 ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉండగా వాటిలో 40కిపైగా లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు DMHO కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ ప్రకారం కలెక్టర్ అనుమతి అవసరం కావడంతో ప్రక్రియ ఆలస్యం అవుతోందని, తద్వారా CMRF, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావట్లేదు.


