News October 6, 2024
పొదిలి: ఉప సర్పంచ్‌పై రాడ్లతో దాడి

ఉప సర్పంచ్‌పై రాళ్ల దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన పొదిలి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం ఉపసర్పంచ్ ఓంకార్‌ని శనివారం అర్ధరాత్రి సమయంలో, తన ఇంటికి వెళ్ళే క్రమంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కాపుకాసి రాడ్లుతో తలమీద దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Similar News
News March 18, 2026
ప్రకాశ: విద్యుత్ వినియోగదారులకు ఎస్ఈ సూచనలు

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు. గడువు లోపు చెల్లిస్తే సర్ ఛార్జ్, పెనాల్టీ పడదని అన్నారు. జిల్లాలో కోట్ల రూపాయల మేర బిల్లు బకాయిలు విద్యుత్ సంస్థకు పెనుభారంగా మారాయని ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చు అని తెలిపారు.
News March 18, 2026
ప్రకాశం: మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

ఉమ్మడి ప్రకాశం జిల్లా మహిళలకు నెల రోజులు ‘లేడీస్ టైలరింగ్’పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూడ్‌సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి మే 4 వరకు ఒంగోలులోని రూడ్‌సెట్‌లో శిక్షణ ఇస్తామన్నారు. 19 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు గల మహిళలు అర్హులన్నారు. శిక్షణలో ఉచిత భోజన, వసతి, సదుపాయాలు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ కాలేజీ వద్ద గల రూడ్‌సెట్‌కు రావాలన్నారు.
News March 18, 2026
ప్రకాశం: ‘22 గ్రామాల సమస్య.. పట్టించుకోండి’

పొన్నలూరు (M)లోని 22 గ్రామాల సమస్య ఇది. కరోనా కష్టకాలంలో యూజర్లను తమవైపు తిప్పుకున్న నెట్‌వర్క్‌లు ప్రస్తుతం మూలనపడ్డాయి. ప్రధానంగా K.అగ్రహారంలో కొద్దిరోజులక్రితం సెల్ టవర్లు తీసేశారు. ప్రస్తుతం ఆ ప్రాంత వాసుల పరిస్థితి అడవుల్లో జీవిస్తున్నట్లే ఉంది. దీంతో సచివాలయ, బ్యాంక్ సేవలు సైతం డల్ అయ్యాయి. ఇదే ప్రాంతంలో BSNL టవర్ నిరుపయోగంగా ఉంది. 10 రోజులుగా కాల్స్ కూడా రావట్లేదని యూజర్ల ఆరోపిస్తున్నారు.


