News October 6, 2024

దసరా సెలవులు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి

image

దసరా సెలవులు ప్రారంభమవడంతో ఇంటి వద్ద ఉంటున్న పిల్లలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. నిన్న APలోని ఎమ్మిగనూరులో ఈతకు వెళ్లి ఒకరు, బహిర్భూమికి వెళ్లి నీటి కుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు. అలాగే ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ కూల్‌డ్రింక్ అనుకుని పురుగు మందు తాగి ఓ విద్యార్థి మరణించాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా తోటి పిల్లలతో కలిసి వాళ్లు ఏంచేస్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? అనేది పేరెంట్స్ గమనించాలి.

Similar News

News November 7, 2025

APPLY NOW: NIEPMDలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్ విత్ మల్టిపుల్ డిజాబిలిటీస్ (NIEPMD)లో 7 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, మహిళలు, PWBDకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. BOT, PG డిప్లొమా, BPT, Bsc నర్సింగ్, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://<>niepmd.<<>>nic.in/

News November 7, 2025

బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్

image

బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పేరెంట్స్ అయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 7న మగబిడ్డ జన్మించాడని విక్కీ కౌశల్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరికి 2021లో వివాహమైంది.

News November 7, 2025

భారత భూమికి ఉన్న గొప్పతనం ఇదే!

image

గత 8 ఏళ్లలో 14 దేశాలు తిరిగిన తర్వాత ఇండియాకు ఉన్న గొప్పతనాన్ని గుర్తించానని ఓ ట్రావెలర్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. అమెరికా & యూరప్‌లలో ఎక్కువగా చలి, మధ్యప్రాచ్యంలో దారుణమైన వేడి, ఆగ్నేయాసియాలో అధిక తేమ ఉంటుందని పేర్కొన్నారు. అదే ఇండియాలో వెదర్ హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. ప్రకృతి ఇంతగా అనుకూలించినప్పటికీ అవినీతి, దూరదృష్టి లోపం కారణంగానే భారత్ వెనకబడిందని అభిప్రాయపడ్డారు.