News October 6, 2024

ఆకస్మిక వరదలు.. ఒకే కుటుంబంలో ఏడుగురు సమాధి

image

భారీ వర్షాల కారణంగా మేఘాలయలో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. 24 గంటల వ్యవధిలో 10 మంది మరణించారు. సౌత్‌గారో హిల్స్ జిల్లాలోని గసుఆపారాలో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబంలోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. డాలు ప్రాంతంలో ముగ్గురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన సీఎం కాన్రాడ్ కె సంగ్మా వారికి వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 1, 2025

ఏకాదశి వ్రతం ఎలా పాటించాలి?

image

ఏకాదశి వ్రతం పాటించే భక్తులు ఆ రోజున ఉపవాసం ఉండాలి. విష్ణువును తులసి మాలలతో పూజించాలి. రాత్రంతా పురాణ శ్రవణం చేస్తూ, జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి ఘడియల్లో మళ్లీ విష్ణు పూజ చేసి, భోజనం స్వీకరించాలి. అలా వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే నారద పురాణం ప్రకారం.. ధాన్యం, సంపద, ఉన్నత స్థానం లభిస్తాయని నమ్మకం. యజ్ఞయాగాలు, పుణ్యక్షేత్ర దర్శనాల ఫలం కన్నా ఎన్నో రెట్ల అధిక పుణ్యం వస్తుందట.

News November 1, 2025

పొడిబారిన జుట్టుకు పంప్కిన్ మాస్క్

image

తేమ కోల్పోయి నిర్జీవమైన జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావాలంటే గుమ్మడికాయ హెయిర్ ప్యాక్ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎర్ర గుమ్మడి కాయ ముక్కల్లో కాస్త తేనె వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 3 గంటల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పట్టులా మృదువుగా మారుతుంది.

News November 1, 2025

ఇండస్ నీరు ఏమాత్రం ఆగినా పాక్‌లో వినాశనమే: IEP

image

పాకిస్థాన్‌లో 80% వ్యవసాయం ‘ఇండస్’ నీటిపైనే ఆధారపడింది. ఈ బేసిన్ అత్యధిక భాగం ఉన్న ఇండియా కనుక నీటి ప్రవాహాన్ని ఏమాత్రం ఆపినా పాక్ తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతుందని సిడ్నీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ పేర్కొంది. పాక్‌లోని సింధునది ఆనకట్టల్లో 30రోజులకు మించి నీటి నిల్వలకు అవకాశం లేదని పేర్కొంది. దీనివల్ల దీర్ఘకాలంపాటు సాగు దెబ్బతిని ఆ దేశ వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించింది.