News October 6, 2024

ఇంటిపనులు చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే!

image

దొంగలు పలు రకాలు! ఇంట్లోవాళ్లను చంపిమరీ దోచుకెళ్లే వారు కొందరు. బట్టలు ఉతికి, మొక్కలకు నీళ్లుపోసి, ఫ్లోర్ తుడిచి, ఇల్లు సర్ది, వంటచేసి, భోజనం తిని ‘ఫీల్ ఎట్ హోమ్’ అన్నట్టుగా ప్రవర్తించేవారు ఇంకొందరు. UKలో వోజ్నిలోవిక్ ఇదే కోవకు చెందుతాడు. ఓ మహిళ ఇంట్లోకి చొరబడి వైన్ తాగి ‘డోన్ట్ వర్రీ, బీ హ్యాపీ, బాగా తినండి’ అని రాసిపెట్టాడు. మరో ఇంటికెళ్లి పట్టుబడ్డాడు. కోర్టు అతడికి 22 నెలల జైలుశిక్ష వేసింది.

Similar News

News January 12, 2026

వచ్చే నెలలోనే పరిషత్ ఎన్నికలు?

image

TG: మునిసిపల్ ఎన్నికలవగానే FEB చివరి వారం లేదా MAR తొలి వారంలో పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించనున్నట్లు సమాచారం. కొత్త ఆర్థిక సంవత్సరంలో 16వ ఆర్థిక సంఘం అమల్లోకి రానుంది. పరిషత్‌లకు ₹550Cr పెండింగ్ నిధులు రావాలంటే 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియడానికి నెల రోజుల ముందే ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

News January 12, 2026

వెనిజులా అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన ప్రకటన

image

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌ ద్వారా వెల్లడించారు. మదురో అరెస్ట్ తర్వాత వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్‌గా డెల్సీ రోడ్రిగ్స్ నియమితులైన విషయం తెలిసిందే. అయితే ఆ దేశంపై పూర్తి ఆధిపత్యం కోసం చూస్తున్న ట్రంప్ ఏకంగా అధ్యక్షుడిని తానేనంటూ పై ఫొటోను పోస్ట్ చేశారు.

News January 12, 2026

INDvsNZ.. తొలి వన్డేలో నమోదైన రికార్డులు

image

⋆ వన్డేల్లో భారత్ 300+ టార్గెట్ ఛేజ్ చేయడం ఇది 20వ సారి. ఈ లిస్టులో భారత్‌దే టాప్ ప్లేస్
⋆ అత్యధిక సార్లు(5) వన్డేల్లో వరుసగా 5 లేదా అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లలో 50+ స్కోర్ చేసిన ఆటగాడిగా కోహ్లీ
⋆ 2025CT తర్వాత వన్డేల్లో NZకి ఇదే తొలి ఓటమి
⋆ 2023 నుంచి వన్డేల్లో NZపై భారత్‌కు వరుసగా ఇది ఎనిమిదో విక్టరీ
⋆ NZపై IND ఛేజ్ చేసిన రెండో హైయెస్ట్ స్కోర్(301) ఇదే