News October 6, 2024
విశాఖ డెయిరీ అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి: జనసేన కార్పొరేటర్

విశాఖ డెయిరీ అవినీతి బాగోతంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆదివారం మాట్లాడారు. ఉత్తరాంధ్రలో విశాఖ డెయిరీకి మూడు లక్షల మంది పాడి రైతులు దశాబ్దాలుగా పాలు పోస్తూన్నారని, రూ.200 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ డెయిరీ చరిత్రలో ఇప్పుడు నష్టాల బాటలో ఉన్నా ఆడారి కుటుంబం మాత్రం లబ్ది పొందిందన్నారు. డెయిరీ ఆస్తులపై CBI విచారణ చేయాలన్నారు.
Similar News
News March 5, 2026
ముగ్గురు సహచరులు – ఒక్కటే లక్ష్యం: నారా లోకేశ్

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలు సాధించిన ముగ్గురు నేతల (లోకేశ్, పల్లా, గంటా శ్రీనివాసరావు) అరుదైన ఫొటోను మంత్రి నారా లోకేశ్ పంచుకున్నారు. అత్యధిక ఓట్ల మెజారిటీ పొందిన ముగ్గురు సహచరులుగా.. ఈ గెలుపు తమపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతిరోజూ పూర్తి నిబద్ధతతో, వినమ్రతతో ప్రజలకు సేవ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
News March 5, 2026
విశాఖలో నడిరోడ్డుపై మృతదేహం

విశాఖలో నడిరోడ్డుపై వ్యక్తి విగతజీవిగా పడిఉన్నాడు. అందరూ చూస్తున్నారే గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. గంటల తరబడి మృతదేహం అలాగే ఉన్నా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు సైతం పట్టించుకోలేదు. ఇసుకతోట జంక్షన్ వెంకజిపాలెం వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గంటల తరబడి మృతదేహం అలానే ఉంది.
News March 4, 2026
రేపు విశాఖలో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

నరవ నుంచి వచ్చే ప్రధాన పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని ఈస్ట్, వెస్ట్, పెందుర్తి జోన్ల పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోతుందని జీవీఎంసీ ఈఈ మురళీకృష్ణ తెలిపారు. లక్ష్మీ నగర్, జ్యోతి నగర్ ఏరియాల్లో లీకేజీలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని, ప్రజలు సహకరించాలన్నారు.


