News October 6, 2024

కాంగ్రెస్ మోసాలపై నిలదీయండి.. యువతకు హరీశ్‌రావు పిలుపు

image

TG: గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేసిన యువత ఓసారి ఆలోచించాలని హరీశ్‌రావు కోరారు. ‘పింఛన్ పెంచలేదు. పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసాకు దిక్కులేదు. బోనస్‌ను బోగస్ చేశారు. ఉద్యోగాల ఊసులేదు. రూ.4వేల భృతికి నీళ్లు వదిలారు. ఈ దసరాకు సొంతూళ్లకు వస్తున్న వారితో INC మోసాలపై చర్చించండి. ఆ పార్టీ నాయకులను నిలదీయండి’ అని Xలో పిలుపునిచ్చారు.

Similar News

News March 7, 2026

CEC వేలు కోసేసే వాడిని.. TMC ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

image

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం మమతా బెనర్జీతో CEC చెడుగా ప్రవర్తించారు. CM వైపు వేలు ఎత్తడానికి ధైర్యం చేశారు. CEC కాకపోయుంటే నేను అదే రోజు ఆయన వేలును కోసేసే వాడిని’ అని కోల్‌కతాలో నిరసన కార్యక్రమంలో అన్నారు. SIR విషయంలో గత నెలలో జ్ఞానేశ్ కుమార్‌, మమత మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

News March 7, 2026

28,740 పోస్టులు.. ఫలితాలు విడుదల

image

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ షార్ట్‌లిస్ట్‌ను తపాలా శాఖ <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచింది. రాతపరీక్ష లేకుండా పదో తరగతిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 23లోపు ఒరిజినల్ డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించింది. కాగా APలో 1,060, TGలో 608 ఉద్యోగాలున్నాయి. పోస్టును బట్టి రూ.10వేల నుంచి రూ.29,380గా శాలరీ ఉంటుంది.

News March 7, 2026

ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయా?

image

ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయని అమెరికా చెబుతోంది. 2 రోజులుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు తగ్గాయని అంటోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. మరోవైపు ఇరాన్ వద్ద కేవలం 1,000 బాలిస్టిక్ మిసైళ్లు మాత్రమే ఉండొచ్చని యూరేషియా గ్రూప్ ప్రెసిడెంట్ ఇయాన్ బ్రెమ్మర్ అంచనా వేశారు. యుద్ధం మొదట్లో మాదిరి ఇప్పుడు పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు చేయట్లేదని చెప్పారు.