News October 6, 2024

వంగర: చెరువులో పడి యువకుడి మృతి

image

వంగర మండల కేంద్రంలోని అరసాడలో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో సుకాసి శంకర్ (29) గల యువకుడు గ్రామ శివాలయం వెనుక బాహ్య ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం వెళ్లి చెరువులో కాలుజారి చనిపోయినట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. ఆదివారం మృతుని తల్లి గౌరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నీ రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News March 7, 2026

సివిల్స్ ర్యాంకర్ రామును అభినందించిన అచ్చెన్న

image

జి. సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 463వ ర్యాంకు సాధించడం పట్ల వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రాము కష్టపడి చదివి ఈరోజు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కృషి ఉంటే ఎలాంటి పరిస్థితులులోనైనా ఉన్నత స్థాయిలో రాణించవచ్చన్నారు.

News March 7, 2026

శ్రీకాకుళం: కేజీబీవీల్లో ప్రవేశాలకు వేళాయె!

image

పేద విద్యార్థులకు ప్రమాణాలతో విద్య అందిస్తున్న కేజీబీవీలో 6 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీలు ఉన్నాయి. ఈనెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. డ్రాప్ అవుట్, అనాధ, సింగిల్ పేరెంట్ బాలికలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

News March 7, 2026

శ్రీకాకుళం: వ్యవసాయ కూలీ కొడుకు సివిల్స్‌లో సత్తా

image

జి. సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్స్ పరీక్షల్లో ప్రతిభ చాటుతూ ఆల్ ఇండియా స్థాయిలో 463వ ర్యాంకు సాధించారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రామును తల్లి లక్ష్మి వ్యవసాయ పనులు చేస్తూ చదివించారు. జి.సిగడాం ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివిన ఆయన, వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం 11 నెలలు ఉద్యోగం చేసి, సివిల్స్ లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలి సిద్ధమయ్యారు.