News October 6, 2024
దువ్వూరు: శవమై తేలిన తప్పిపోయిన రెండేళ్ల బాలుడు

దువ్వూరుకు చెందిన తంగేడు పల్లె సాయికుమార్ కుమారుడు అమర్(2) ఈనెల 3న ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు. ఆ సమయంలో బాలుడి ఆచూకి కోసం తల్లిదండ్రులు దువ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత బాలుడు కేసి కాలువలో శవమై తేలాడు. బాలుడు మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 10, 2026
కడప: MSPతో 10,059 క్వింటాళ్లు కొనుగోలు

కడప జిల్లాలో సోమవారం నాటికి రైతుల నుంచి కనీస మద్దతు ధర(MSP)తో 10,059 క్వింటాళ్ల పంటను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. సుమారు 2,021 మంది రైతుల నుంచి 8,210 క్వింటాళ్ల శనగలు, 50 మంది రైతుల నుంచి 1,819 క్వింటాళ్ల కందులు, 1 రైతు నుంచి 30 క్వింటాళ్ల పెసలు కొనుగోలు చేశారు. జిల్లాలో 21 ప్రొక్యూర్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో క్వింటాలుకు రూ.200లు రాబడుతున్నారు.
News March 9, 2026
కడప: శనగ కొనుగోలు కేంద్రాల్లో అదనపు వసూళ్లపై జేసీ ఆగ్రహం.!

కడప జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి అదనపు వసూళ్లు చేస్తుండడంపై వస్తున్న పిర్యాదులపై జేసీ నిధిమీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనగ కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితులపై సోమవారం సాయంత్రం కడపలో సంబంధిత అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో అదనపు వసూళ్లపై ఆరా తీశారు. కలెక్టర్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. మార్క్ ఫెడ్ DM, DCMS BM, DCO పాల్గొన్నారు.
News March 9, 2026
కడపలో కేవలం ఆయన వర్గం టీడీపీలోకి వెళ్తోందా?

కడపలో ఇటీవల YCP నుంచి TDPలోకి కార్పొరేటర్లు చేరుతున్నారు. ఇందులో సింహభాగం మాజీ మేయర్ సురేశ్ బాబు వర్గమే TDP కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఆయన ప్రధాన అనుచరుడిగా పేరున్న సూర్యనారాయణ TDPలో చేరారు. ఆ తర్వాత దాదాపు 8 మంది కార్పొరేటర్లు YCPకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో నలుగురు చేరారు. మేయర్ సీటు కోల్పోవడంతో ఆయనే TDPలోకి పంపిస్తున్నారంటూ YCPలోని మరో వర్గం గుసగుసలాడుతున్నాయి.


