News October 6, 2024

RBI వడ్డీరేట్ల కోత లేనట్టేనా!

image

RBI MPC అక్టోబర్ మీటింగ్‌లో రెపోరేట్ల కోత ఉండకపోవచ్చని సమాచారం. రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్టు కమిటీ భావిస్తోందని తెలిసింది. వెస్ట్ ఏషియాలో యుద్ధంతో క్రూడాయిల్ ధరలు ఎగిశాయి. దీంతో ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే వడ్డీరేట్ల కోత కోసం డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే. 2023, ఫిబ్రవరి నుంచి రెపోరేట్ 6.5 శాతంగా ఉంది.

Similar News

News October 6, 2024

గ్లామర్ పేరుతో శరీరాన్ని చూపించలేను: ప్రియా భవానీ

image

గ్లామర్ పేరుతో శరీరాన్ని చూపించడం తనకు ఇష్టం లేదని హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ అన్నారు. తన శరీరాన్ని ఒక వస్తువుగా భావించనని చెప్పారు. ‘కెరీర్ పరంగా ఎప్పుడైనా వెనుదిరిగి చూసుకుంటే నేను ఏ విషయంలోనూ బాధపడకూడదు. అందుకు అనుగుణంగా ఇప్పుడే నిర్ణయాలు తీసుకుంటా. అలాగే ఫ్యాషన్ పేరుతో కొన్నింటిని ప్రమోట్ చేయను’ అని ఆమె తెగేసి చెప్పారు. కాగా ప్రియా భవానీ ‘కళ్యాణం కమనీయం’, ‘రత్నం’ తదితర చిత్రాల్లో నటించారు.

News October 6, 2024

Air Indiaపై హాకీ క్రీడాకారిణి ఫైర్

image

విమాన‌యాన సంస్థ‌ల సిబ్బంది ప్ర‌యాణికుల ల‌గేజీపై ఎంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తారన్నది సామాన్యుల‌కు తెలిసిందే. ఈ అనుభవం ఇప్పుడు స్టార్ హాకీ క్రీడాకారిణి రాణీ రాంపాల్‌కు ఎదురైంది. ఇటీవ‌ల అమె Air India విమానంలో కెనాడా నుంచి ఢిల్లీ వ‌చ్చారు. అయితే, ఆమె లగేజీ ధ్వంసమ‌వ్వ‌డంపై మండిపడ్డారు. ‘మీ అద్భుతమైన బ‌హుమానానికి ధ‌న్య‌వాదాలు. మీ సిబ్బంది మా బ్యాగ్‌లను ఇలా చూస్తారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News October 6, 2024

CM చంద్రబాబును కలిసిన మాజీ CM

image

AP: మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు ఇరువురూ చర్చించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కిరణ్ కలిశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.