News October 6, 2024
నెల్లూరు: దసరాకు ఊర్లకు వెళ్లేవారికి హెచ్చరిక

నెల్లూరు జిల్లాలో దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాలు జరగకుండా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలని ఎస్పీ జి క్రిష్ణ కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. LHMS యాప్, 9440796383, 9392903413 నంబర్ లకు, స్థానిక పోలీసులను సంప్రదించి LHMS సేవలు ఉచితంగా పొందవచ్చన్నారు. డబ్బు, విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్లకూడదని బ్యాంకులో ఉంచుకోవాలన్నారు.
Similar News
News January 7, 2026
మిల్లర్లు సహకరించాలి: నెల్లూరు జేసీ

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా మిల్లర్లు సహకరించాలని నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలోని మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీకి సంబంధించి ధాన్యం సేకరణ, బ్యాంకు గ్యారంటీలపై చర్చించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.
News January 7, 2026
నెల్లూరు: మత్స్యకారులకు నావిగేషన్ పరికరాలు

నెల్లూరు జిల్లాలో మత్స్యకారులకు భద్రతతో పాటు చేపలు ఉండే ప్రాంతాన్ని పసిగట్టే నావిగేషన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. జిల్లాలో 3వేల బోట్లకు వీటిని అమర్చనుంది. నెల్లూరులోని జిల్లా మత్స్య శాఖ ఆఫీసుకు ఈ పరికరాలు వచ్చాయి. వీటిని బోట్లకు అమర్చడంతో మత్స్సకారులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
News January 6, 2026
నెల్లూరు: MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

వేరుశనగ, నిమ్మ పంటలకు అనుగుణంగా MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. నెల్లూరు జడ్పీలో మంగళవారం సమావేశం జరిగింది. ఎలాంటి గ్యారంటీలు లేకుండా MSMEలకు రుణాలు ఇవ్వడం లేదని చర్చ జరిగింది. MSME రుణాల మంజూరుకు మార్జిన్ మనీ ఇస్తామని.. రుణాలు త్వరగా ఇవ్వాలని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు కోరారు.


